Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్.. ఈ సారి ఏకంగా వారిపైనే ఫిర్యాదు..!
Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా సీబీఐ అధికారిపైనే ఫిర్యాదు చేశారు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు?
Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా సీబీఐ అధికారిపైనే ఫిర్యాదు చేశారు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజులు గడుస్తున్నా కొద్ది అనేక మలుపులు తిరుగుతోంది. విచారణ జరుపుతున్న సీబీఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ కొంతమంది తెరమీదకు వస్తున్నారు. తాజాగా వివేకానందరెడ్డి వద్ద సుదీర్ఘ కాలంగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి, సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను బెదిరిస్తున్నారని, సంబంధం లేని కొంతమంది పేర్లు చెప్పాలని తనను ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ, లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు కృష్ణారెడ్డి.
కొద్ది రోజుల కిందట కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు కృష్ణారెడ్డి. వివేకా హత్య కేసులో కొంత మంది తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. సీబీఐ అధికారులు కొంత మంది ఇతరుల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు కృష్ణారెడ్డి. అయితే ఆ ఫిర్యాదుపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు అతని లాయర్లు. దీంతో పులివెందుల కోర్టును ఆశ్రయించానని చెబుతున్నారు కృష్ణారెడ్డి. గతంలో అనంతపురం ఎస్పీని కలిసి ఇదే తరహా ఫిర్యాదు చేశారు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి. వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని, డబ్బులు కూడా ఆశ చూపారని ఫిర్యాదు చేశారాయన. అయనకు కూడా ఈ కేసుతో సంబంధం ఉండటం గమనార్హం.
Also read:
Andhra Pradesh: మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదట.. అది నమ్మిన వృద్ధురాలి పరిస్థితి ఏమైందంటే..
Anandayya Medicine: మరో వివాదంలో ఆనందయ్య మందు.. నోటీసులు జారీ చేసిన కలెక్టర్.. వారం రోజుల గడువు..!
Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..