Kadapa: సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే
అదృష్టం ఎప్పుడు, ఎవరిని కాపాడుతుందో ఎవరికీ తెలియదు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అదే చెబుతోంది. పులివెందుల–తాడిపత్రి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ యువకుడు బస్సు కదలగానే కాలుజారి కిందపడ్డాడు. క్షణాల్లో ప్రాణాపాయం దాటిన ఆ యువకుడు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు.

ఒక్కొక్కరికి ఏమి చేయకుండానే ఆపద వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.. అలాగే కొంతమందిని తెలియకుండానే వారి అదృష్టం కాపాడుతూ ఉంటుంది.. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది బస్సు ఎక్కి కాలుజారి కింద పడ్డ ఓ ప్రయాణికుడు తన ప్రాణాలను కాపాడుకొని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం పూలంగండ్ల సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు నుంచి ఓ యువకుడు జారిపడ్డాడు .. గురువారం మధ్యాహ్న సమయంలో పులివెందుల నుంచి తాడిపత్రి వెళ్లేందుకు పూలంగళ్ళ సర్కిల్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ఆ యువకుడు తాడిపత్రి వెళ్లేందుకు బస్సు రావడంతో ఎక్కాడు. మెట్లపైనే ఉండటంతో.. బస్సు మూమెంట్ ఇవ్వగానే.. జారి కిందపడ్డాడు.. ప్రమాదంలో యువకుడికి ఎటువంటి గాయాలు కాలేదు. అంతేకాకుండా ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డాడు. బస్సులో నుంచి ఆ యువకుడు బయటపడ్డ విజువల్ చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే. అలా బస్సు ఎక్కాడు.. ఇలా కాలుజారి కిందపడ్డాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది.. ఏది ఏమైనా ఈ సుడిగాడి అదృష్టం మాత్రం మామూలుగా లేదని అది చూసిన తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
