Watch: కాలువలో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే.. షాకింగ్ సీన్!.. ధైర్యవంతులు మాత్రమే ఈ వీడియో చూడండి!
అది సాయంకాలం.. ఆ ప్రాంతంలో నిత్యం జనాలు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూలానే బుధవారం కూడా జనాలు తిరుగుతున్నారు. అప్పుడే వారికి రోడ్డు పక్కనున్న కాలువ సమీపంలో ఏదో వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని తొంగిచూస్తే ఏదో కదలికలు.. అనుమానంతో కాస్తా ఏకాగ్రత పెట్టి చూశారు. దెబ్బకు వాళ్లకు ఒళ్ళు జలదరించే సీన్ కనిపించింది. దీంతో వారంతా షాక్ అయ్యారు. ఇంతకు వాళ్లు చూసిందేంటి?

ఈ మధ్యకాలంలో తరచూ వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. వాటిని చూసిన జనాలు భయాందోళనకు గురై వాటిని చంపేయడమో లేదా ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పటించడమో చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. విశాఖ తుంగ్లాం ఏరియాలో ఓ కాలువ ఉంది. ఆ రోడ్డులో జనం నిత్యం అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తికీ ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న ఆ వ్యక్తి ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు.
అక్కడ ఏదో కదులుతున్నట్టు అతను గుర్తించారు. ఏంటా అని కాస్తా దగ్గరకి వెళ్లి తొంగిచూశాడు. ఇంకేముంది భారీ పాము అతని దృష్టిలో పడింది. దీంతో ఆతను ఒక్కసారిగా కంగుతిన్నాడు. గుండెలు చేతపట్టి వెనక్కి జరిగాడు. ఇక వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకి స్నేక్ క్యాచర్ దృష్టికి వెళ్లింది. దీంతో స్నేక్ క్యాచర్ సొసైటీ కిరణ్ కుమార్ హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
రంగంలోకి దిగిన కిరణ్ కాలువ సమీపంలో ఉన్నది నాగుపాముగా గుర్తించాడు. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము కాలువ నుంచి పైకి వస్తున్నట్టు గుర్తించాడు. భారీ నాగుపాము వేగంగా పాకుతూ కనిపించింది. చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో ఆ భారీ నాగుపాము కదలికలతో అక్కడున్నవారంతా ఒకింత భయానికి గురయ్యారు. ఎంతో నేర్పుతో కోబ్రాను రెస్క్యూ చేశాడు కిరణ్. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
