AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హీరో బాలయ్యకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. ‘నా ఇలాకాలో మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటి?’ అంటూ..

తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి తాగుబోతులకు వెనకేసుకొచ్చి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని బాలయ్యను హెచ్చరించారు. దీనిపై ఇక్కడైనా ఎక్కడైనా చర్చకి సిద్ధమంటూ సవాల్‌ విసిరారు.

Andhra Pradesh: హీరో బాలయ్యకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. 'నా ఇలాకాలో మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటి?' అంటూ..
Gopireddy, Balakrishna
Basha Shek
|

Updated on: Mar 15, 2023 | 6:13 PM

Share

హీరో బాలకృష్ణ..నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వార్నింగ్‌లూ… కౌంటర్లతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలి తప్ప మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ బాలకృష్ణ వార్నింగ్‌ ఇస్తే..నా ఇలాకాలో నీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటి..అంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి తాగుబోతులకు వెనకేసుకొచ్చి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని బాలయ్యను హెచ్చరించారు. దీనిపై ఇక్కడైనా ఎక్కడైనా చర్చకి సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. అసలు మా విషయంలో తలదూర్చడానికి మీరెవరంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఏదైనా మాట్లాడే ముందు అన్ని విషయాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ‘ తాగితందనాలాడిన వాడిని మందలిస్తే.. మీరు స్పందించడమేంటి? అలాంటి వాళ్లని వెనకేసుకొచ్చి మీ వ్యక్తిత్వాన్ని దిగాజార్చుకుంటున్నారు. చర్చకైనా..దేనికైనా సిద్ధం. అయినా మీరెవరు మాకు వార్నింగ్‌ ఇవ్వడానికి? రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాడిని..బాలకృష్ణగారు.. ముందు మీరు విషయం తెలుసుకొని మాట్లాడండి’ అని బాలకృష్ణకు కౌంటరిచ్చారు ఎమ్మెల్యే

వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం ప్రభ ఊరేగింపు సందర్భంగా బాలకృష్ణ పాట పెట్టాడు వైసీపీ కార్యకర్త భాస్కర్‌రెడ్డి. ఆపై అతడిని ఎమ్మెల్యే వేధించినట్లు ప్రచారం జరిగింది. అనంతరం భాస్కర్‌రెడ్డి.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపైనే MLA శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఈ విషయంపైనే స్పందించారు గోపిరెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?