Andhra Pradesh: సీఎంగా చార్జ్ తీసుకున్న తర్వాత బాబు సంతకాలు ఆ 3 ఫైళ్లపైనే..!

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఏపీ నుంచి ముగ్గురికి కేబినెట్‌లో చోటు కూడా దక్కింది. ఇక రాష్రంలో ప్రభుత్వ ఏర్పాటుపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఏపీలో కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు.. ఏ శాఖలు ఎవరిని వరించబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక చంద్రబాబు తొలిగా ఏ ఫైళ్లపై సంతకాలు పెడతారనే అంశంపై విపరీతంగా చర్చ నడుస్తోంది. 

Andhra Pradesh: సీఎంగా చార్జ్ తీసుకున్న తర్వాత బాబు సంతకాలు ఆ 3 ఫైళ్లపైనే..!
Nara Bhuvaneshwari - Chandrababu Naidu
Follow us

|

Updated on: Jun 10, 2024 | 4:53 PM

ఢిల్లీ పర్యటన ముగియడంతో కొద్ది సేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం ఉండటంతో.. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీలో సీనియర్లు, సామాజికసమీకరణాలు, మహిళలతో పాటు పార్టీకి విధేయతతో పనిచేసే వారి పేర్లను పరిశీలిస్తున్నారు. కూటమి తరపున 164 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములా మారింది. మంగళవారం కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం తర్వాత మంత్రివర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక చంద్రబాబు ఏ ఫైళ్లపై తొలిగా సంతకం చేస్తారనే అంశంపై విపరీతమైన సమాచారం జరుగుతోంది.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనున్నట్లు సమాచారం. వైసీపీ మెగా డీఎస్సీ అంటూ చీట్ చేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని బాబు పలు సభల్లో ప్రకటించారు. దీంతో ఆ మేరకు ముందుకు వెళ్లే చాన్స్ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని కూటమి తెగ ప్రచారం చేసింది. అంతే కాదు ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని కూటమి స్ఫష్టం చేసింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు.. నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్‌ను కలిపి జూన్ నెల పింఛన్ 7 వేలు అందిస్తామని ప్రకటించారు.  ఇక బాబు 3వ సంతకం… ఎన్నికల హామిల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.