NTR District: చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అసలే మృగశిర కార్తె.. ఇగ చూస్కో

నేషనల్ హైవేపై చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. అతివేగం కారణంగా వ్యాన్ పల్టీ కొట్టడంతో.. అందులోని చేపలన్నీ రహదారిపై... చెల్లాచెదురుగా పడిపోయాయి. దారి పొడవునా చేపలు చెల్లాచెదురుగా పడిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దొరికిందే చాలని కొంతమంది వాటిని కవర్లలో పట్టుకెళ్లారు.

NTR District: చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అసలే మృగశిర కార్తె.. ఇగ చూస్కో
Fish Load
Follow us

|

Updated on: Jun 10, 2024 | 5:15 PM

విజయవాడ- హైదరాబాద్ హైవేపై ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద క్యాట్ ఫిష్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రోడ్డు పక్కన చేపలన్ని చెల్లాచెదరుగా పడిపోయాయి. దీంతో చేపల కోసం జనం ఎగబడ్డారు. దొరికిన చేపలను పట్టుకుని తీసుకెళ్లారు స్థానికులు. అటుగా వెళ్తున్న వాహనదారులు సైతం చేపలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. అసలే మృగశిర కార్తె నడుస్తోంది. ఈ సీజన్‌లో చేపలు తింటే మంచిదని చెబుతుంటారు. అందుకే చేపలు డిమాండ్ పెరిగింది. ధర కూడా భారీగానే ఉంది. ఇలాంటి సమయంలో ఫ్రీగా చేపలు దొరికితే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందరూ స్థానికంగా ఉన్న జనాలంతా ఈ చేపల కోసం ఎగబడ్డారు. దొరికిందే సందని కొంతమంది వాటిని కవర్లలో పట్టుకెళ్లారు.

క్యాట్ ఫిష్ తింటే ఖతం…. 

వాస్తవానికి  క్యాట్‌ ఫిష్‌ను ఎప్పుడో తెలుగు రాష్ట్రాల్లో నిషేధించారు. దీన్ని తింటే రోగాలను ఆహ్వానించినట్లే.  క్యాట్‌ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్‌ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే  కొర్రమీను పేరుతో క్యాట్‌ ఫిష్‌ను విక్రయాలు జరుపుతున్నారు కొందరు. పట్టణాలు, సిటీల్లోని హోటల్లు, రెస్టారెంట్స్‌కు ఈ చేపలనే తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరునెలల్లోనే 20 కేజీల బరువు వరకు పెరుగుతుంది. కుంటలు లేదా చెరువుల్లో మిగతా చేపలు అన్నింటిని చంపి తినేస్తాయి ఈ క్యాట్ ఫిష్‌లు.. వీటి పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితం అవుతుంది.. అందుకే ప్రభుత్వాలు వీటిని నిషేధించాయి.  అయితే చాటుమాటుగా వీటి పెంపకం, విక్రయాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా వ్యాన్ బోల్తాపడటంతోనే ఈ బాగోతం బయటపడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Latest Articles