YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఝలక్.. ఫైనల్ ఛార్జ్‌షీట్ రిజెక్ట్ చేసిన కోర్టు..

వివేకా హత్య కేసులో సిబిఐకి మరోసారి చుక్కు ఎదురైంది. వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన చివరి ఛార్జ్ షీట్ నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది. టెక్నికల్ కారణాలను చూపెడుతూ సీబీఐ కోర్టు ఆ ఛార్జ్‌ షీట్‌ను వెనక్కి పంపింది. ఇంతకీ సీబీఐ కోర్టు ఎందుకు ఛార్జ్‌షీట్‌ను రిజెక్ట్ చేసింది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఝలక్.. ఫైనల్ ఛార్జ్‌షీట్ రిజెక్ట్ చేసిన కోర్టు..
Ys Vivekananda Reddy Murder Case
Follow us
Vijay Saatha

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 11, 2023 | 5:13 PM

వివేకా హత్య కేసులో సిబిఐకి మరోసారి చుక్కు ఎదురైంది. వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన చివరి ఛార్జ్ షీట్ నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది. టెక్నికల్ కారణాలను చూపెడుతూ సీబీఐ కోర్టు ఆ ఛార్జ్‌ షీట్‌ను వెనక్కి పంపింది. ఇంతకీ సీబీఐ కోర్టు ఎందుకు ఛార్జ్‌షీట్‌ను రిజెక్ట్ చేసింది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ లో సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్‌షీట్‌ను సిబిఐ కోర్టు వెనక్కి పంపింది. కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపుతూ సిబిఐ కోర్టు వెనక్కి పంపింది. ఇప్పటి వరకు వివేకా కేసులో దాదాపు మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు అయినప్పటికీ సిబిఐ కోర్టు చివరి దానిని మాత్రమే మాత్రమే వెనక్కి పంపింది. చివరి ఛార్జ్‌షీట్‌లో వివేకానంద రెడ్డి హత్యకు జరిగిన కుట్ర, సుపారి నేపథ్యంతో పాటు కొంతమంది కీలకమైన వ్యక్తుల పేర్లు పెట్టిందనే ప్రచారం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన కాపీలో కీలక విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ముగిసిన నేపథ్యంలో సిబిఐ కోర్టు టెక్నికల్ రీజన్స్‌ని చూపెడుతూ ఛార్జ్‌షీట్‌ను రిజెక్ట్ చేయడం ఆసక్తిగా మారింది. రిజెక్ట్ చేసిన ఛార్జ్‌షీట్‌లో ఉన్న తప్పులను సరిదిద్ది మళ్లీ సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసింది సీబీఐ, దీంతో సరిచేసిన ఛార్జ్‌షీట్‌ కాపీలో ఎలాంటి అంశాలను సీబీఐ మెన్షన్ చేసిందనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..