AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతోన్న నకిలీ కరెన్సీ నోట్లు.. 8 మంది అరెస్టు

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ కరెన్సీ సిజ్ అవుతుండటం, పలువురు అరెస్ట్ అవుతుండటం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే అరెస్టయిన వారిలో పోలీసులు కూడా ఉండటం మరింత విస్మయానికి గురిచేస్తోంది.

Andhra Pradesh: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతోన్న నకిలీ కరెన్సీ నోట్లు.. 8 మంది అరెస్టు
Currency Note
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 11, 2023 | 5:55 PM

Share

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో నకిలీ కరెన్సీలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ కరెన్సీ సిజ్ అవుతుండటం, పలువురు అరెస్ట్ అవుతుండటం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే అరెస్టయిన వారిలో పోలీసులు కూడా ఉండటం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఒరిజినల్ కరెన్సీ నోట్లకు మూడు రెట్లు అదనంగా నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మబలుకుతున్నారని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ 2009 నుంచి పనిచేస్తున్నారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ కుమార్‎కి విస్తృతంగా పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతోపాటు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అతను అక్రమ మార్గాలు ఎంచుకున్నాడు. అత్యంత నేరమయమైన నకిలీ కరెన్సీని చలామణి చేయాలని అనుకున్నాడు.

అందులో భాగంగానే కారుమంచి గ్రామానికి చెందిన అంజనేయ అనే వ్యక్తి దగ్గర పరిచయాలు పెంచుకున్నాడు. 10 లక్షలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే 30 లక్షలు నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తానని నమ్మ పలికాడు. అనుకున్నట్టుగానే ఆంజనేయ నుంచి నాలుగు లక్షల 80,000 ఒరిజినల్ కరెన్సీని తీసుకున్నాడు. దీనికి అదనంగా మొత్తం 15 లక్షల రూపాయల విలువైన నకిలి కరెన్సీ నోట్లు ఇస్తానని చెప్పారు విజయ్ కుమార్. కానిస్టేబుల్‎ను నమ్మిన ఆంజనేయ చెప్పిన మాట ప్రకారం ఒరిజినల్ కరెన్సీ ఇచ్చాడు. కానీ కానిస్టేబుల్ విజయకుమార్ మాత్రం ఫేక్ కరెన్సీ ఇవ్వలేకపోయారు. ఇక చేసేదేమి లేక ఆంజనేయ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో గుట్టు కాస్త రట్టు అయ్యింది. విషయం ఎస్పీ వరకు వెళ్లడంతో వెంటనే కానిస్టేబుల్ విజయ్ కుమార్‎ని వీఆర్కు పిలిపించారు. అంతేకాకుండా ఆదోని డీఎస్పీని విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా విచారించిన ఆదోని డీఎస్సీ శివ నారాయణస్వామి నిజమే అని నివేదిక ఇచ్చారు దీంతో విజయ్ కుమార్ను సస్పెండ్ చేశారు.

ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, నకిలీ కరెన్సీ ఎవరికీ ఇచ్చారు, నకిలీ కరెన్సీ చలామణిలో ఉందా… అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా దీనిపై విచారణ కొనసాగుతుంది అని విచారణ అధికారి ఆదోని డిఎస్పి స్వామి స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే నకిలీ కరెన్సీ నియంత్రించాల్సిన పోలీసులు వారే నకిలీ కరెన్సీ ఉపయోగించుకుంటున్నారు అంటే కంచే చేను మేచిన చందంగా ఉందని చెప్పవచ్చు. ఇది గనుక పోలీసులు నిజాయితీగా విచారణ జరిపిస్తే ఇంకా ఎవరెవరు పోలీసులు దీని వెనుక ఉన్నారు అనేది గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికంటే రెండు రోజులు ముందు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు సిద్ధమైన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నలుగురు తెలంగాణలోని గద్వాల జిల్లా క్యాతూరు గ్రామానికి చెందినవారు మరో నలుగురు కర్నూలు జిల్లాకు చెందినవారు. తెలంగాణ ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేయడానికి ప్రయత్నించింది. 30 లక్షలు ఒరిజినల్ కరెన్సీని.. కర్నూలు జిల్లా ముఠా నుంచి తీసుకొని 90 లక్షల పైగా నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు సిద్ధమైంది. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపుల రోడ్డులో ఈ ఎనిమిది మంది ముఠా కరెన్సీ మార్చుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

దాదాపు కోటి రూపాయలకు పైగా విలువచేసే నకిలీ కరెన్సీని సీజ్ చేసి.. 8 మందిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా కూపీ లాగుతున్నారు.నకిలీ కరెన్సీ చలామణి సరే.. అసలు ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ తయారవుతోంది. ఎవరు తయారు చేస్తున్నారు పట్టుబడిన నకిలీ కరెన్సీ మూలాలు ఎక్కడ అనే విషయాలను ఇంకా పోలీసులు బహిర్గతం చేయలేదు. అదే గనుక జరిగితే చిత్తశుద్ధితో విచారణ జరిగితే నకిలీ కరెన్సీ మూలాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ నకిలీ కరెన్సీ తయారీ చలామణి వెనుక కొందరు పోలీసులు ఉన్నారు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

( రిపోర్టర్: నాగిరెడ్డి, కర్నూలు జిల్లా )

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు