MP Raghurama: టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.. ఎంపీ రఘురామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతిస్తే వైసీపీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధందా ఉన్నారని తెలిపారు. నిజాలు మాట్లాడే ఎమ్మెల్యే కోటంగెడ్డి, శ్రీధర్ రెడ్డిలను టీడీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసిందని చెప్పారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతిస్తే వైసీపీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధందా ఉన్నారని తెలిపారు. నిజాలు మాట్లాడే ఎమ్మెల్యే కోటంగెడ్డి, శ్రీధర్ రెడ్డిలను టీడీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసిందని చెప్పారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సైతం సంఘీభావం తెలిపారన్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న రెడ్డి నాయకులు టీడీపీ వైపు చూడడం ఆ పార్టీ ఎదుగుదలను సూచిస్తోందని పేర్కొన్నారు.
ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలకు చెందిన నాయకులను తమ పార్టీ పెద్దలు ఏకవచనంతో సంబోధించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా టీడీపీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారనే సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ సత్తా తెలుసుకోవాలంటే టీడీపీ నుంచి వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మె్ల్యేలు అలాగే.. వైసీపీ నాయకత్వంతో విభేదిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని.. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పు తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించగా… తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే 70 శాతం నిధులను అప్పుల రూపంలో తీసుకుందని.. మిగతా 9 నెలలు ఎలా సర్దుబాటు చేస్తారో అర్థం కావడం లేదని తెలిపారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
