Andhra Pradesh: అమృత్ భారత్‌తో మారిన ఏపీ రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. రైల్వే శాఖ మంత్రి వెల్లడి.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి వివరించారు. గతంలో కేంద్రంలోని...

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలోని 72 స్టేషన్లలో అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి వివరించారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కంటే 219 శాతం అధికంగా మోడీ ప్రభుత్వం రైల్వే కేటాయింపులు జరిపాయని ఎంపీ జీవీఎల్ అన్నారు.
రాజ్యసభలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రైల్వే ప్రాజెక్టులగురించి పార్లమెంటులో ప్రశ్నించగా రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సమాధం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు. 2022 ఏప్రిల్ నెలవరకు ఆంధ్ర ప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి సంబంధించి 16 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ లైన్లు వెరసి 31 ప్రాజెక్టులు కేటాయించారని చెప్పుకొచ్చారు. మొత్తం 5,581 కిలోమీటర్లు గాను వ్యయం 70,594 కోట్లు అని తెలియచేశారు. ఈ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, మార్చి 2022 వరకు 636 కిలోమీటర్ల దూరాన్ని 19,414 కోట్లతో నిర్మించడం జరిగిందని తెలియజేశారు.
ఈ విషయమై జీవీఎల్ రైల్వే మంత్రికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లోని స్టేషన్ల అభివృద్ధికి, మౌలిక అవసరాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, రైళ్ల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ స్టేషన్లు, వందేభారత్ రైళ్లు దీనికి ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు.



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




