Minister Ambati Rambabu: సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదు.. టీడీపీ పతనానికి ఇదే నాంది.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..

లోకేష్‌ది యువగళం కాదు.. యువ గరళం అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా లోకేశ్ తీరు ఉందని దుయ్యబట్టారు. పోలీసులను ఉద్దేశించి..

Minister Ambati Rambabu: సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదు.. టీడీపీ పతనానికి ఇదే నాంది.. మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..
Minister Ambati Rambabu
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 3:46 PM

లోకేష్‌ది యువగళం కాదు.. యువ గరళం అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా లోకేశ్ తీరు ఉందని దుయ్యబట్టారు. పోలీసులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు బూతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు. అలా మాట్లాడటం టీడీపీ పతనానికి నాంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా అని ఫైర్ అయ్యారు. లోకేశ్ చిత్తశుద్ధిలేని పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇంతకీ సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. ఆయన యాత్ర అంతా కాలక్షేపం కోసమేనని, ఎంతమంది కలిసొచ్చినా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోతారని తీవ్ర కామెంట్స్ చేశారు. లోకేశ్ కు ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి. ఎంత మంది వచ్చినా.. జగన్ ముందు నిలబడలేరు. లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చాక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. ఇప్పుడు యువగళం పేరుతో యాత్ర మొదలు పెట్టారు. గరళం తీసుకుని బయలుదేరారు. లోకేశ్ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేరు. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి లోకేశ్ కు లేవు. పాదయాత్రతో వచ్చినా.. వారాహితో వచ్చినా అంతా హాస్యమే. పవన్‌ నోటికి అడ్డూ అదుపు లేదు. ఆఖరికి తన తండ్రి గురించి ఏదేదో మాట్లాడతారు. లోకేశ్ తన తండ్రి కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నారు. ఇద్దరి మాటలు అచ్చం జోకర్ల మాదిరిగా ఉన్నాయి.

– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి

ఇవి కూడా చదవండి

తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. కానీ తాను మంత్రిగా ఎంతో సేవ చేశానని, రోడ్లు వేయించానని, చెట్టు నాటానని ఏదేదో లోకేష్ చెప్తున్నారన్న అంబటి రాంబాబు.. లోకేష్‌కూ ఏ అర్హతా లేదని మండిపడ్డారు. ఆయన ప్రత్యక్షంగా ఏ ఎన్నికలోనూ గెలవలేదని, కేవలం చంద్రబాబు కుమారుడిగా ఎమ్మెల్సీ అయి, దొడ్డి దారిలో మంత్రి అయ్యారని ఫైర్ అయ్యారు. కేవలం చంద్రబాబు తనయుడుగా తప్ప, లోకేశ్ కు ఒక్కటైనా అర్హత ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు పాదయాత్రకు కొత్త కాదని, ఆనాడు మహానేత వైఎస్సార్‌ సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి అంబటి రాంబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..