AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ ఇంటికి గోదావరి పులస.. అభిమాన హీరో కోసం యానాం నుంచి స్పెషల్ గిఫ్ట్!

పుస్తెలమ్మైనా పులస తినాలి అని గోదావరి జిల్లాల్లో ఓ నానుడి ఉంది. అంతటి క్రేజ్ ఉన్న పులస చేప ఇప్పుడు మెగాస్టార్ ఇంటికి చేరింది. గోదావరి నదిలో మత్స్యకారుడి వలకు చిక్కిన కేజీన్నర చేపను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి, మరో వ్యక్తి సహాయంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి గిఫ్ట్‌గా పంపించారు

మెగాస్టార్ ఇంటికి గోదావరి పులస.. అభిమాన హీరో కోసం యానాం నుంచి స్పెషల్ గిఫ్ట్!
Megastar Chiranjeevis Pulasa Fish Gift
Anand T
|

Updated on: Sep 09, 2026 | 10:27 AM

Share

గోదావరి జిల్లాల్లో లభించే పులస చేపలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ దొరికే పులస చేపలను ఎంత ఖర్చైనా సరే వేలంలో కొని విదేశాలకు పంపిస్తుంటారు జనాలు. అయితే తాజాగా కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు కేజీన్నర బరువున్న అరుదైన పులస చేప చిక్కగా, దాన్ని యానాం మార్కెట్‌లో వేలం వేయడంతో రూ. 20 వేల భారీ ధర పలికింది. ఈ చేపను జి.వి. అనే వ్యక్తి రూ. 20 వేలు వెచ్చించి దక్కించుకున్నారు. అనంతరం ఆయన వేరొక వ్యక్తి ద్వారా ఈ ప్రత్యేకమైన చేపను సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి పంపించినట్లు మత్స్యకారులు తెలిపారు.

తగ్గని పులస క్రేజ్

గోదావరి జిల్లాల వాసులకు పులస చేప అంటే ఎనలేని మక్కువ. ఈ చేప దొరికితే చాలు, ధరతో సంబంధం లేకుండా ఎంత మొత్తమైనా వెచ్చించి కొనుగోలు చేసి, విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న తమ బంధువులకు పంపించడం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. యానాం గోదావరి పులస కోసం స్థానికులే కాకుండా మెగాస్టార్ లాంటి ప్రముఖ సినీ హీరోలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని, వీరి కొనుగోళ్లతో పులసకు క్రేజ్ మరింత పెరిగిందని గోదావరి జిల్లా వాసులు భావిస్తున్నారు.

ఈ ఏడాది దొరక్క దొరుకుతున్న పులస చేపలు వేల రూపాయల ధర పలుకుతుండటంతో, “పులస మజాకానా” అంటూ స్థానిక ప్రజలు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ. 20 వేల పులస చేప.. చిరంజీవికి కానుకగా పంపిన అభిమాని!
రూ. 20 వేల పులస చేప.. చిరంజీవికి కానుకగా పంపిన అభిమాని!
మాస శివరాత్రి.. ఈరోజు పూజకు అత్యంత శుభ సమయం ఇదే! సకల శుభాలు..
మాస శివరాత్రి.. ఈరోజు పూజకు అత్యంత శుభ సమయం ఇదే! సకల శుభాలు..
కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? ఈ 6 సంకేతాల అర్థం తెలుసా?
కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? ఈ 6 సంకేతాల అర్థం తెలుసా?
బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం
బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం
మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.
మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.
పీఎస్‌కు వచ్చి మరీ పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లిన మందుబాబు!
పీఎస్‌కు వచ్చి మరీ పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లిన మందుబాబు!
భారీగా పతనమైన బంగారం ధరలు.. గంటల్లోనే పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..
భారీగా పతనమైన బంగారం ధరలు.. గంటల్లోనే పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..
వాష్ రూంలో నాగుపాము.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. వామ్మో..!
వాష్ రూంలో నాగుపాము.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. వామ్మో..!
రెండు గుప్పెళ్ళు తింటే 24 గంటల్లోనే కళ్ళజోడు లేని కంటి చూపు
రెండు గుప్పెళ్ళు తింటే 24 గంటల్లోనే కళ్ళజోడు లేని కంటి చూపు
ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. విలనిజమే కాదు నవ్వించడమూ తెలుసు.
ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. విలనిజమే కాదు నవ్వించడమూ తెలుసు.