AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ముంచెత్తిన మురసు.. శుక్ర, శనివారాల్లో తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపీలో తుఫాన్ ముప్పును అంచనా వేసేందుకు మరో కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.

ఏపీ ముంచెత్తిన మురసు.. శుక్ర, శనివారాల్లో తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
Ap Cyclone Murasu Damage
Anand T
|

Updated on: Nov 12, 2026 | 8:30 PM

Share

ఏపీ మురసు తుఫాన్ ముంచెత్తిన విషయం తెలిసిందే.. అయితే తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి అర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపంనుంది. శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. ఈ బృందం రెండ్రోజుల పాటు రాష్ట్రాంలోని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుందని రాష్ట్ర విపత్తల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

అర్నబ్ తుపాను నష్టాలను అంచనా వేయడానికి నియమించిన కేంద్ర బృందాన్నే (IMCT) మురసు తుపాను నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. శుక్రవారం టీం-1 బాపట్ల జిల్లాలో, టీం-2 ఏలూరు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

ఇక శనివారం టీం-1 పల్నాడు జిల్లాలో టీం-2 తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఈ కేంద్ర బృందం సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు.

కేంద్ర బృందలోని సభ్యులు వీరే

ప్రశాంత్ ఆర్మోరికర్, ఏడీసీ, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ.

రేఖారాణి కొల్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్, జల వనరుల మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ.

హిమాలయ గార్గ్, అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.

శశాంక్ శేఖర్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ.

అలోక్ జవహర్, డిప్యూటీ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.

ప్రణయ్ గార్గ్, డిప్యూటీ డైరెక్టర్, విద్యుత్ మంత్రిత్వ శాఖ.

డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ, సైంటిస్ట్ ‘SF’, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇస్రో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
ఈ రాశులవారు వెండి ఉంగరం ధరిస్తే.. పట్టిందల్లా బంగారమే!ఎవరు దూరంగా
ఈ రాశులవారు వెండి ఉంగరం ధరిస్తే.. పట్టిందల్లా బంగారమే!ఎవరు దూరంగా
అప్పటినుంచే కృష్ణుడి భక్తురాలిగా మారిపోయా: కాజల్ అగర్వాల్
అప్పటినుంచే కృష్ణుడి భక్తురాలిగా మారిపోయా: కాజల్ అగర్వాల్
పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే
పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా
ముచ్చింతల్‌లో ఐదు రోజుల ఆధ్యాత్మిక సంబరం.. యతీంద్ర సప్తతిలో..
ముచ్చింతల్‌లో ఐదు రోజుల ఆధ్యాత్మిక సంబరం.. యతీంద్ర సప్తతిలో..
వైట్ హౌస్ సమీపంలో షూటింగ్.. నలుగురు మృతి!
వైట్ హౌస్ సమీపంలో షూటింగ్.. నలుగురు మృతి!
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
రోహిత్‌కు బాగా కలిసొచ్చిన మైదానం..రేపు రికార్డులు బద్దలే
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'కల్ట్'! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!
మందుబాబులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై చుక్కేసి చిక్కితే జైలుకే!