Washington DC : అమెరికాలో కాల్పుల మోత.. వైట్ హౌస్ సమీపంలో షూటింగ్.. నలుగురు మృతి!
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు జనాలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి పంపారు.
మరోవైపు కాల్పులకు పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ఈ కాల్పులు వైట్ హౌస్‌కు సమీపంలో జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసలు కాల్పులు జరిపింది ఎవరూ, కాల్పులకు గల కారణాలు ఏంటీ అనేవి పూర్తి తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
