AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharani Rice: ప్రభుత్వం నుంచి అదరిపోయే గుడ్‌న్యూస్.. రూ.1300కే 26 కేజీల రైస్‌ బ్యాగ్

ఇటీవల బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పేరుతో ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా నాలుగు రకాల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో ఈ కౌంటర్ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Dharani Rice: ప్రభుత్వం నుంచి అదరిపోయే గుడ్‌న్యూస్.. రూ.1300కే 26 కేజీల రైస్‌ బ్యాగ్
Subsidized 26kg Rice Bag
Anand T
|

Updated on: Nov 12, 2026 | 4:33 PM

Share

పెరుగుతున్న బియ్యం ధరల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ధరణి పేరుతో తక్కువ ధరకే రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు సన్న బియ్యాన్ని విక్రయిస్తున్నారు అధికారులు. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఈ విధానం అమల్లోకి రావడంతో అక్కడి రైతు బజార్లలో బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ ప్రత్యేక కౌంటర్లలో మొత్తం నాలుగు రకాల బియ్యాన్ని అందిస్తున్నారు అధికారులు. అందులో బీపీటీ, కేఎన్‌ఎం కేజీ బియ్యాన్ని రూ.66కు విక్రయిస్తుండగా, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యాన్ని కేజీ రూ.76కు విక్రయిస్తున్నారు. ఇక స్వర్ణమసూరి బియ్యం ధర రూ.47గా ఉండగా.. జైశ్రీరామ్‌ బియ్యం కేజీ ధర రూ.82గా నిర్ణయించారు. ఇక ధరణి సన్నబియ్యం 26 కిలోల బస్తాను కేవలం రూ.1,300కే ప్రజలకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు తమ ఆధార్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి ఇక్కడ బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇదిలా ఉండగా, కొంతమంది అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో హోల్‌సేల్ షాపుల నిర్వాహకులు కచ్చితంగా షాపు వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. ఈ నిబంధనలు పాటించని షాపుల యాజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే రైస్ మిల్లర్లకు కూడా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే బియ్యం విక్రయించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని బియ్యం దుకాణాలు, రైస్ మిల్లుల్లో సరైన ధరకే బియ్యం విక్రయిస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us