AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ లెక్కల విషయంలో జెన్‌జీ రూటే సపరేట్.. యువత ఆలోచన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

సంపాదించిన డబ్బును విలాసాలకు ఖర్చు చేయడం కాదు.. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ తెలివిగా అడుగులు వేయడమే నేటి జెన్ Z ఫాలో అవుతున్న కొత్త సూత్రం.. షాపింగ్, ట్రావెలింగ్, గాడ్జెట్లను ఇష్టపడుతూనే, ఆర్థిక ప్రణాళిక విషయంలో యువత ఎంతో పరిణతి చూపిస్తోంది. EVI- RBI ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో నేటి యువత ఖర్చులు, పొదుపు అలవాట్లపై ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి.

బడ్జెట్ లెక్కల విషయంలో జెన్‌జీ రూటే సపరేట్.. యువత ఆలోచన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Gen Z Spending Habits In India
Krishna S
|

Updated on: Nov 12, 2026 | 4:20 PM

Share

నేటి తరం యువత అంటేనే ఖరీదైన కేఫ్‌లు, బ్రాండెడ్ దుస్తులు, లేటెస్ట్ గాడ్జెట్లు, సోషల్ మీడియా ట్రెండ్‌ల వెంట పరుగెత్తేవారని చాలామంది భావిస్తుంటారు. విలాసవంతమైన జీవనశైలికే వీరు ఎక్కువగా డబ్బు తగలేస్తారనే అభిప్రాయం సర్వసాధారణంగా ఉంది. కానీ తాజాగా వెలువడిన ఓ నివేదిక ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. డబ్బు ఖర్చు చేసే విషయంలో జెన్ Z ఆలోచనా విధానంలో ఊహించని మార్పు వచ్చింది. విలాసాల కంటే భవిష్యత్తు భద్రత, పొదుపు, పెట్టుబడులకే నేటి యువత పెద్దపీట వేస్తోంది. EVI- RBI ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా డీకోడింగ్ జెన్ జెడ్ ఇన్ ఇండియా పేరుతో రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 1,046 మంది జెన్ Z యువతపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. ఏకంగా 81 శాతం మంది జెన్ Z యువత ఏదో ఒక రూపంలో ఆర్థిక ప్రణాళిక ఖర్చుల నిర్వహణపై దృష్టి సారిస్తున్నారు. 62 శాతం మంది యువత తమ ఆదాయంలో పొదుపు, పెట్టుబడులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 33 శాతం మంది పక్కాగా బడ్జెట్ రూపొందించుకుని, దానికి అనుగుణంగానే ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

జెన్ Z డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తోంది?

యువత ఖర్చు విధానాలు వారి అవసరాలు, ఇష్టాల కలయికగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

కనీస అవసరాలు (59శాతం): దాదాపు 59 శాతం మంది గృహావసరాలు, ఇంటి అద్దె, రవాణా వంటి తప్పనిసరి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఫ్యాషన్ – టెక్నాలజీ (57శాతం): 57 శాతం మంది దుస్తులు, కొత్త గాడ్జెట్లపై ఖర్చు చేస్తున్నారు. అయితే ఇతర ముఖ్యమైన అవసరాలను పక్కన పెట్టకుండా, వాటితో పాటే వీటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.

ప్రయాణాలు – వినోదం: 44 శాతం మంది ప్రయాణాలు, సెలవుల కోసం ఖర్చు చేస్తుండగా.. 39 శాతం మంది స్నేహితులతో గడపడానికి, వినోదానికి డబ్బు కేటాయిస్తున్నారు.

అనవసర ఖర్చులకు చెక్.. కానీ సవాళ్లు తప్పడం లేదు..

తమ ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలనే స్పృహ యువతలో బాగా పెరిగింది. అందుకే, ప్రణాళిక లేకుండా చేసే షాపింగ్, అవసరం లేకపోయినా కొత్త గాడ్జెట్లు కొనడం, కేవలం ట్రెండ్స్ కోసం డబ్బు వృథా చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని వారు భావిస్తున్నారు. ఏదైనా కొనే ముందు అది నిజంగా అవసరమా? తమ బడ్జెట్‌కు సరిపోతుందా? అని ఆలోచిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో యువతకు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. సర్వే ప్రకారం 15 శాతం మంది ఇప్పటికీ ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఖర్చు చేస్తుండగా, 4 శాతం మంది అసలు బడ్జెట్ అనేదే వేసుకోవడం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు మూడింట రెండు వంతుల మంది యువత తాము వేసుకున్న బడ్జెట్‌కు కట్టుబడి ఉండటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మొత్తంగా చూస్తే, నేటి జెన్ Z తరానికి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఖరీదైన వస్తువులు కొనడమే గొప్ప జీవనశైలి కాదని, అవసరాలు మరియు ఇష్టాల మధ్య సమతుల్యత సాధించడమే అసలైన స్మార్ట్ లైఫ్‌స్టైల్ అని యువత నిరూపిస్తోంది.

Follow Us
బడ్జెట్ లెక్కల విషయంలో జెన్‌జీ రూటే సపరేట్.. యువత ఆలోచన చూస్తే..
బడ్జెట్ లెక్కల విషయంలో జెన్‌జీ రూటే సపరేట్.. యువత ఆలోచన చూస్తే..
పట్టి పీడిస్తున్న అలాంటి ఇన్ఫెక్షన్లను ఈ రాయితో తరిమికొట్టండి
పట్టి పీడిస్తున్న అలాంటి ఇన్ఫెక్షన్లను ఈ రాయితో తరిమికొట్టండి
కోతుల బెడదతో విసిగిపోయారా? టెర్రస్, నీటి ట్యాంక్‌ రక్షణ కోసం ఇలా
కోతుల బెడదతో విసిగిపోయారా? టెర్రస్, నీటి ట్యాంక్‌ రక్షణ కోసం ఇలా
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు
కుజుడి కటాక్షంతో వీరికి మహర్దశ..118 రోజులు కెరీర్‌లో తిరుగే ఉండదు
కుజుడి కటాక్షంతో వీరికి మహర్దశ..118 రోజులు కెరీర్‌లో తిరుగే ఉండదు
పిండినల్లి నివారణకు ఆర్గానిక్ స్ప్రే.. ఇంట్లోనే తయారు చేయండి ఇలా
పిండినల్లి నివారణకు ఆర్గానిక్ స్ప్రే.. ఇంట్లోనే తయారు చేయండి ఇలా
లెనిన్ నటుడి కొత్త మూవీ.. ప్రమోద్ హీరోగా హల్కా డాన్
లెనిన్ నటుడి కొత్త మూవీ.. ప్రమోద్ హీరోగా హల్కా డాన్
అమ్మ ఒడికి చేరాల్సిన పసికందు.. పొదల్లో విగతజీవిగా! వీధి కుక్కల
అమ్మ ఒడికి చేరాల్సిన పసికందు.. పొదల్లో విగతజీవిగా! వీధి కుక్కల
వద్దన్నా లాగించేస్తారు.. పెరుగు వడ ఇలా చేస్తే అదిరిపోద్దీ!
వద్దన్నా లాగించేస్తారు.. పెరుగు వడ ఇలా చేస్తే అదిరిపోద్దీ!
రొయ్యలు టమాటో కర్రీ.. ఇలా వండితే నోరూరడం ఖాయం!
రొయ్యలు టమాటో కర్రీ.. ఇలా వండితే నోరూరడం ఖాయం!