AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: వధువు మెడలో తాళి కట్టబోతున్న సమయంలో వచ్చిన ఫోన్.. అంతా ఫసక్..

కర్నూలు జిల్లాలో ఓ పెళ్లి పీటలపై ఆగిపోయింది. ఓ ఫోన్ కాల్ రావడంతో పెళ్లి పెటాకులయ్యింది. వరుడి గురించి అసలు విషయం తెలిసి అందరూ షాకయ్యారు. మరికొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనుకుంటున్న సమయంలో ఓ వార్త తెలిసింది. అదెంటో తెలుసుకుందా పదండి...

Kurnool: వధువు మెడలో తాళి కట్టబోతున్న సమయంలో వచ్చిన ఫోన్.. అంతా ఫసక్..
Wedding
J Y Nagi Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 21, 2024 | 11:55 AM

Share

కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది. ఓ అమ్మాయి నిండు జీవితం నిలబడింది. వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యువకుడు.. విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ యువతితో అతనికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనం వరకూ వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసి కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

వెల్దుర్తి మండలం బ్రహ్మగుండం క్షేత్రంలో బుధవారం ఉదయం 9 గంటలకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. గుడిలో ఏర్పాట్లన్నీ చేశారు. బంధువులంతా వచ్చారు. తీరా వధూవరులు పెళ్లి పీటలు ఎక్కే సమయంలో పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లికొడుకు తన ప్రియుడంటూ.. పిల్లలు కూడా ఉన్నారంటూ ఆ యువతి చెప్పింది. ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసింది. దీంతో షాక్‌కి గురైన పెళ్లికూతురు బంధువులు వెంటనే పెళ్లి ఆపేశారు. పెళ్లికూతురు కుటుంబీకులకు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించి క్షమాపణలు చెప్పారు పెళ్లికొడుకు కుటుంబీకులు. పెళ్లి ఆగిపోవడంతో మిత్రులు, బంధువుల ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

ఒకరిని తల్లిని చేసి.. మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డ ఆ యువకుడు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అతగాడిని అదుపులోకి తీసుకుని పూర్థి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని పలువరు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

పిప్పిని పడేయకండి.. ఉసిరికాయను ఇలా తింటే 50 శాతం రోగాలు మాయం
పిప్పిని పడేయకండి.. ఉసిరికాయను ఇలా తింటే 50 శాతం రోగాలు మాయం
బలమైన రాశ్యధిపతి.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
బలమైన రాశ్యధిపతి.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
ఏవియేషన్ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్..!
ఏవియేషన్ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్..!
వారసులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.100కే రిజిస్ట్రేషన్..
వారసులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.100కే రిజిస్ట్రేషన్..
రాత్రిపూట బాత్‌రూమ్‌లో వింత శబ్దాలు..ఏంటా అని డోర్ ఓపెన్ చూసిషాక్
రాత్రిపూట బాత్‌రూమ్‌లో వింత శబ్దాలు..ఏంటా అని డోర్ ఓపెన్ చూసిషాక్
రూ. 78 వేలు కడితే చాలు లైఫ్ అంతా కరెంట్ ఫ్రీ..
రూ. 78 వేలు కడితే చాలు లైఫ్ అంతా కరెంట్ ఫ్రీ..
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రెండు రోజులు బ్యాంకు సేవల్లో అంతరాయం
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రెండు రోజులు బ్యాంకు సేవల్లో అంతరాయం
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి కొత్త జీవితం!
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి కొత్త జీవితం!
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే
ప్రేయసిని పర్వతంపైకి తీసుకెళ్లి వదిలేసినా ప్రియుడు.. కట్ చేస్తే