AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Tourism: కృష్ణమ్మ ఒడిలో జల విహారం.. బెజవాడలో సెంటర్లో సందర్శకుల సందడి..

ఉరుకులు పరుగుల జీవన విధానంలో సిటీ లైఫ్ గజిబిజి గందరగోళంగా మారింది. విధి నిర్వహణలో, నగరంలోని ట్రాఫిక్‎లో ప్రయాణం ఇలా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. అలాంటి జీవనం నుంచి బయట పడేందుకు ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీకెండ్స్లోలో దూర ప్రాంతాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రదేశాల్లో గడిపేవారు.

AP Tourism: కృష్ణమ్మ ఒడిలో జల విహారం.. బెజవాడలో సెంటర్లో సందర్శకుల సందడి..
Jalavihar Park In Vijayawada
M Sivakumar
| Edited By: Srikar T|

Updated on: Mar 21, 2024 | 12:47 PM

Share

ఉరుకులు పరుగుల జీవన విధానంలో సిటీ లైఫ్ గజిబిజి గందరగోళంగా మారింది. విధి నిర్వహణలో, నగరంలోని ట్రాఫిక్‎లో ప్రయాణం ఇలా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. అలాంటి జీవనం నుంచి బయట పడేందుకు ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీకెండ్స్లోలో దూర ప్రాంతాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రదేశాల్లో గడిపేవారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా, నగరంలోనే నందన వనం లాంటి పార్కు అందుబాటులోకి వచ్చింది. కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆటపరికరాలు ఏర్పాటు. చేశారు. ఒకప్పుడు పార్కుకు వెళ్లాలంటే నగరంలో రాజీవ్ గాంధీ పార్కు, అంబేడ్కర్ పార్కు వంటి వాటికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కృష్ణమ్మ నదీ తీరాన ఏర్పాట్లు చేసిన పార్కును ఆశ్రయిస్తున్నారు స్థానికులు.

ఒకవైపు కృష్ణానది నుంచి వీచే చల్లటి గాలుల మధ్య ఆహ్లాదం కలిగించే రకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఒకసారి పార్కును సందర్శించిన వారికి ఆహ్లాదకరమైన వాతావరాణాన్ని అందించేలా దీనిని తీర్చిదిద్దారు. వాకింగ్, ఓపెన్హమ్లో వ్యాయామం‎తో మానసిక ఉల్లాసం పొందేలా రూపొందించారు. ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడికి తరలివస్తున్నారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మానవులకు శారీరక శ్రమ లేక పోవడంతో ఎక్కువగా దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులకు గురవుతున్నారు. వాటి నుంచి బయట పడేందుకు వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు కొందరు పట్టణ వాసులు. ఒకప్పుడు వ్యాయామం చేయాలంటే జిమ్‎కు వెళ్లాల్సి వచ్చేది. లేదంటే వాకింగ్ ట్రాక్ ఉన్న గ్రౌండ్కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సందర్శకులు చెప్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసిన కృష్ణమ్మ జలవిహారం పార్కు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సందర్శకులు పార్కుకు వస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా పార్కులో కాసేపు సేద తీరేందుకు వీలుగా లైటింగ్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్జమ్, పిల్లలు కృష్ణ ఆడుకునేందుకు ఆట పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం నగరానికే ఐకాన్‎గా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..