AP News: తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..

అనంతపురం జిల్లాలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో కలిసి పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. నరేంద్ర అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించారు. అతడి దగ్గర ఉన్న చేతి సంచిలో తనిఖీలు చేయగా....

AP News: తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..
Tadipatri Bus Stand
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2024 | 11:40 AM

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా మెరుపు సోదాలు చేస్తోంది.  ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులో నంద్యాల జిల్లాకు ఆవులదొడ్డి గ్రామానికి చెందిన నరేంద్ర బ్యాగ్‌తో టెన్షన్ పడుతూ కనిపించాడు. అనుమానం వచ్చి.. అతని బ్యాగ్ చెక్ చేయగా అందులో రూ.12.77 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మనీ ఎందుకోసం అని ప్రశ్నించగా… ప్రొద్దుటూరులో గోల్డ్ తక్కువ ధరకు వస్తుందని,  కొనేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే ఈ డబ్బులకు సంబంధించి ఎలాంటి రసీదు కానీ, ఆధారాలు కానీ లేవు. దీంతో  కేసు నమోదు చేసి, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tadipatri Police

Tadipatri Police

మరో ఘటనలో  హిందూపురం సమీపంలోని బత్తలపల్లికి చెందిన పవన్‌ నుంచి బుధవారం రాత్రి స్థానిక RTC బస్టాండులో పోలీసులు రూ.8.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సొంత ఇంటిని అమ్మగా కొనుగోలుదారులు డబ్బు ఇచ్చినట్లు చెప్పాడు. ఆధారాలు పూర్తిగా చూపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి మనీ సీజ్ చేశారు.

ప్రజంట్ ఎన్నికల సీజన్.. డబ్బు క్యారీ చేస్తుంటే పక్కాగా రసీదులు లేదా ఆధారాలు ఉండేలా చూసుకోండి. మనం నోటి మాట చెబితే సరిపోదు. అధికారులకు పక్కాగా ఆధారాలు చూపించాల్సిందే. లేదంటే.. చిక్కుల్లో పడతారు. ఆ డబ్బు తిరిగి మీది అనిపించుకోడానికి చాలా వ్యయప్రయాసాలు పడాల్సి వస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..