AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో పిడుగులుతో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో పిడుగులుతో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain Alert
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2024 | 10:55 AM

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు తప్పవంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ద్రోణి, ఆవర్తనం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్ లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు.

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం కురిస్తోంది.. బుధవారం కూడా గాలులు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరు జల్లులే పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. అనేక చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజలను భయపెట్టాయి. అయితే రానున్న రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉందని. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ..

అటు తెలంగాణలోనూ ద్రోణి ప్రభావం కనిపిస్తోంది..ఇప్పటికే అనేక జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అన్నదాతలు పంటలు కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు..ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఫలితంగా పంటల నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తీరనినష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి అన్నదాతలు ఆందోళన పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..