Andhra Pradesh: ఆ మహిళతో ఉన్న చనువే చంపేసిందా..? మెట్లపై నుంచి పడి యువకుడు మృతి.. నెలరోజుల తర్వాత..
అనకాపల్లి, సెప్టెంబర్ 09: ఓ యువకుడు ఇంటి వద్దే పడి ప్రణాలు కోల్పోయాడు. అతనికి అంత్యక్రియలకు కూడా చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం..! నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ కుటుంబం ఆవేదనతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల తర్వాత పూడ్చి పెట్టిన మృతదేహాన్ని

అనకాపల్లి, సెప్టెంబర్ 09: ఓ యువకుడు ఇంటి వద్దే పడి ప్రణాలు కోల్పోయాడు. అతనికి అంత్యక్రియలకు కూడా చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం..! నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ కుటుంబం ఆవేదనతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల తర్వాత పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఓ మహిళతో చనువుగా ఉండటమే.. ఈ మరణానికి కారణమని అంతా భావిస్తుండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఈ షాకింగ్ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగింది. వెదురువాడ ఆర్అండ్ఆర్ కాలనీలో ఉన్న ఈ పేద కుటుంబానికి చనిపోయిన యువకుడే పెద్ద దిక్కు. పేరు ఈశ్వరరావు. వయసు 27 ఏళ్లు. ఇంట్లో ఉన్న సోదరి, తల్లికి తనే పోషిస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ గత నెల మూడో తేదీన ఇంటి మెట్ల పై నుంచి పడి, చెవి నుంచి రక్తం కారుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈశ్వరరావు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అయితే, సహజ మరణం అని అంతా భావించి.. కన్నీటి వీడ్కోలు పలికారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఖననం తరువాత పుకార్లు..
ఈశ్వరరావు మరణం తర్వాత.. గ్రామంలో వేర్వేరు రకాలుగా పుకార్లు వినిపించాయి. అది కాస్త కుటుంబం వరకు చేరింది. దీంతో మృతుడి తల్లి విజయ, చెల్లి నాగరత్నానికి అనుమానం వచ్చింది. అనంతరం తల్లి, చెల్లి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈశ్వర రావుది సహజ మరణం కాదని.. తమకు అనుమానాలు ఉన్నాయని.. న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు ఎస్సై. మురళీకృష్ణ కేసుపై విచారణ చేయాలని ఆదేశించడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు ప్రారంభించారు.
నెల రోజుల తర్వాత పోస్టుమార్టం..
రంగంలోకి దిగిన పోలీసులు.. పోస్టుమార్టం నిర్వహించారని నిర్ణయించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అనకాపల్లి వైద్య బృందానికి సమాచారం ఇచ్చారు. అచ్చుతాపురం తాహసిల్దార్ సమక్షంలో.. ఈశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
అయితే, ఈశ్వరరావు ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడని.. ఆ కారణంతోనే మరణం సంభవించి ఉంటుందని కుటుంబ సభ్యుల అనుమానం. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక అనంతరం అసలు విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. మురళీ కృష్ణ మృతికి ఆ మహిళతో చనువుగా ఉండటమే కారణమా..? ఎవరైనా అతన్ని చంపేశారా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..