Andhra Pradesh: ప్రియుడి చేతిలో ఘోరంగా మోసపోయిన మరో ప్రియుడు.. బెడవాడలో ఇప్పుడిదే హాట్ టాపిక్..
ఆ ఇద్దరూ మగాళ్లే.. అందులోనూ ఉన్నత చదువులు చదువుకున్నవారే.. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు కూడా.. కానీ, వీరి వ్యవహారం మాత్రం చాలా విచిత్రమైంది. వీరిద్దరి కేసు ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది. అవును, బెజవాడలో ఇద్దరు మగ టీచర్ల మద్య ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. ప్రేమికుడి కోసం జెండర్ ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటే.. ఇప్పుడు నువ్వొద్దు, నీతో పెళ్లి వద్దు అంటూ వదిలేశాడు ఆ ప్రేమికుడు. దాంతో వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వింత ప్రేమ సమస్యను..
అమ్మాయి అబ్బాయిని మోసం చేసిందని, అబ్బాయి అమ్మాయిని మోసం చేసిందని రోడ్డు మీదకు వచ్చిన కేసులు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అబ్బాయి తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే.. ఆ అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి అమ్మాయి ధర్నా చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసిందని అబ్బాయిలు సూసైడ్ చేసుకున్న ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కేసులన్నీ ఒక ఎత్తైతే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసు మరో ఎత్తు అని చెప్పుకోవాలి.. ఎందుకంటే..
ఆ ఇద్దరూ మగాళ్లే.. అందులోనూ ఉన్నత చదువులు చదువుకున్నవారే.. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు కూడా.. కానీ, వీరి వ్యవహారం మాత్రం చాలా విచిత్రమైంది. వీరిద్దరి కేసు ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది. అవును, బెజవాడలో ఇద్దరు మగ టీచర్ల మద్య ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. ప్రేమికుడి కోసం జెండర్ ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటే.. ఇప్పుడు నువ్వొద్దు, నీతో పెళ్లి వద్దు అంటూ వదిలేశాడు ఆ ప్రేమికుడు. దాంతో వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ వింత ప్రేమ సమస్యను ఎలా పరిష్కరించాలా? అని ఆలోచనలో పడ్డారు పోలీసులు. మరి విచిత్ర ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విజయవాడకు చెందిన పవన్, నాగేశ్వరరావు 1019లో బీఈడీ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. బీఈడీ పూర్తయ్యాక.. కృష్ణలంకలో ఇద్దరూ కలిసి ట్యూషన్ రన్ చేశారు. ఆ సమయంలో వీరి బంధం మరింత బలపడింది. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో పవన్‌కు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించాడు ప్రియుడు నాగేశ్వరరావు. పవన్ పేరును కాస్తా భ్రమరాంబగా మార్చుకున్నాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి కృష్ణ లంకలో సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ మధ్య ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో భ్రమరాంబను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు ప్రియుడు నాగేశ్వరరావు.
దాంతో లబోదిబోమనడం ప్రియురాలైన పవన్ అలియాస్ భ్రమరాంబ వంతు అయ్యింది. ప్రియుడి మాటలు నమ్మి లింగ మార్పిడి చేయించుకున్నానని, నాగేశ్వరరావు తనను దారుణంగా మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించాడు పవన్. లింగమార్పిడి కోసం రూ. 25 లక్షలు పెట్టానని, 10 సవర్ల బంగారం తాకట్టు పెట్టి మరీ లింగ మార్పిడి చేసుకున్నట్లు ఫిర్యాదు పేర్కొంది భ్రమరాంబ. దీనిపై ఈ నెల 10 న భ్రమరాంభ కృష్ణ లంక పోలీసులకు పిర్యాదు చేసింది. నమ్మించి మోదం చేసాడని నాగేశ్వరావుతో పాటు అతని తల్లిపై కేస్ నమోదు చెసింది. ట్రాన్సజేండర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చేసిన పోలీసులు.. సెక్షన్ 406,420,34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మరోవైపు భ్రమరాంభకు న్యాయం చెయ్యాలని ట్రాన్సజెండర్ సంఘం డిమాండ్ చేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..