AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసు రాజీ చేసుకోవడానికి ఒప్పుకోలేదని.. నడి రోడ్డుపై కత్తితో దాడి..!

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుదారుడిని రాజీకి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు . దీనికి ఆతను అంగీకరించకపోవటంతో అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేసు రాజీ చేసుకోవడానికి ఒప్పుకోలేదని కత్తి తో దాడి చేసి హతమార్చాడు. తన ఇంటి గడప ముందే విగత జీవిగా పడివున్న కుటుంబ సభ్యుడిని చూసి బంధువులు విలవిలలాడి పోయారు.

కేసు రాజీ చేసుకోవడానికి ఒప్పుకోలేదని.. నడి రోడ్డుపై కత్తితో దాడి..!
Nidadavolu Crime News
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 04, 2025 | 10:50 AM

Share

మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదుదారుడిని రాజీకి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు . దీనికి ఆతను అంగీకరించకపోవటంతో అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేసు రాజీ చేసుకోవడానికి ఒప్పుకోలేదని కత్తి తో దాడి చేసి హతమార్చాడు. తన ఇంటి గడప ముందే విగత జీవిగా పడివున్న కుటుంబ సభ్యుడిని చూసి బంధువులు విలవిలలాడి పోయారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది.

నిడదవోలు చింతచెట్టు వీధిలో నివసించే వల్లీ భాషా స్థానికంగా వంట మేస్త్రీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమార్తెను సిరంగల్ అనిల్ అనే వ్యక్తి వేధిస్తుండటంతో అతనిపై 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ట్రయిల్‌కు వచ్చింది. ఈ కేసులో నిందితుడు అనిల్ గత కొద్దీ రోజులుగా భాషా వద్దకు వచ్చి రాజికి రావాలని కోరుతున్నాడు. దీనికి భాషా అంగీకరించకపోవటంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే భాషా ఆదివారం(మే 04) తెల్లవారుజామున నమాజ్ కోసం మసీదుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో అనిల్ అక్కడికి చేరుకుని బాధితుడిపై కత్తితో దాడి చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ పెద్ద చనిపోవటంతో భాషా కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.