Andhra News: ఎమ్మెల్యే చేతిలో ఉన్నది కట్టెపుల్ల కాదు బ్రో.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే..
ఆయన ఓ ఎమ్మెల్యే.. గిరిజన ప్రాంతంలోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ప్రజా సమస్యల పట్ల చాలా యాక్టివ్ గా పనిచేస్తారు.. గిరిజనుల సమస్యలపై పోరాడేందుకు ముందుంటారు.. ప్రజల్లో ఒకరిగా మమేకమై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకు వేశారు.. చేతిలో పామును పట్టుకొని అందరిలో అవగాహన కల్పించారు.

ఆయన ఓ ఎమ్మెల్యే.. గిరిజన ప్రాంతంలోని కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ప్రజా సమస్యల పట్ల చాలా యాక్టివ్ గా పనిచేస్తారు.. గిరిజనుల సమస్యలపై పోరాడేందుకు ముందుంటారు.. ప్రజల్లో ఒకరిగా మమేకమై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకు వేశారు.. చేతిలో పామును పట్టుకొని అందరిలో అవగాహన కల్పించారు. ఆయన ఎవరో కాదు.. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు. మూడు రోజుల క్రితం పాడేరులో ఓ పాము కనిపించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేసింది. వింత శబ్దాలు చేస్తూ భయపెట్టింది. అటు ఇటు తిరుగుతూ హడలెత్తించింది. దీంతో పాములు పట్టే నేర్పరి అయిన స్నేక్ కేచర్ వాసుకి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన వాసు.. నాలుగు అడుగుల పైగా పొడవున్న జెర్రీ పోతు పామును చాకచక్యంగా బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అక్కడికి చేరుకున్నారు. స్నేక్ కేచర్ చేతిలో ఉన్న పామును.. ఆయన తీసుకున్నారు. తన చేతితో పట్టుకొని.. పాముకు సపర్యలు చేశారు. పాములు జీవ వైవిధ్యంలో ఒక భాగం అని.. ఎవరు హాని చేయొద్దని అవగాహన కల్పించారు. వాటికి హాని తలబెట్టాలని చూడకుంటే.. అవి కూడా మనల్ని ఏమీ చేయమని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు.
వీడియో చూడండి..
అయితే.. పామును తన చేతిలో పట్టుకుని నిర్భయంగా అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలను చూసి.. వామ్మో ఎంత ధైర్యం అంటూ ప్రశంసించారు అక్కడ ఉన్నవారు.. ఎమ్మెల్యే ధైర్యం చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అనంతరం ఎమ్మెల్యే.. ఆ పామును సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టాలని స్నేక్ కేచర్ కు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..