AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా మీరంతా.. దొంగతనం చేసి కొబ్బరినూనె చల్లారు.. మామూలు స్కెచ్ కాదుగా..

వేసవికాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూటు మారుస్తున్నారు కేటుగాళ్లు.. ఇంటికి తాళం వేసి కనపడితే చాలు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని భావించారు ఈ దుండగులు..

ఎవర్రా మీరంతా.. దొంగతనం చేసి కొబ్బరినూనె చల్లారు.. మామూలు స్కెచ్ కాదుగా..
Crime News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 04, 2025 | 12:42 PM

Share

వేసవికాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూటు మారుస్తున్నారు కేటుగాళ్లు.. ఇంటికి తాళం వేసి కనపడితే చాలు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని భావించారు ఈ దుండగులు.. ఇందు కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే తడువుగా తమ ప్లాన్‌ను అమలు చేశారు కూడా. దొంగతనానికి వెళ్లిన వారు దొంగతనం అనంతరం ఇంట్లో బండలపై కొబ్బరినూనె చల్లి.. అక్కడి నుంచి పరారయ్యారు.. ఫింగర్ ప్రింట్ సహా ఇతర ఆధారాలు దొరకకుండా దొంగలు కొత్త పంథాను ఎంచుకోవడం కలకలం రేపింది.. ఈ దొంగతనం ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ చేసి దుండగులు పరారయ్యారు. స్థానిక మెట్టి విధిలో నివాసం ఉంటున్న రైతు ఉస్మాన్ ఓ పెళ్లి కార్యక్రమం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ పయనం అయ్యాడు. కొన్ని నిముషాల తరువాత ఉస్మాన్ కుమారుడు ఎదో వస్తువు కోసం తిరిగి ఇంటికి వెళ్లి చుస్తే అక్కడ ఇంటి తాళం తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.. వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చుస్తే ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలకొట్టి, లక్ష నగదు, మూడు తులాల బంగారు, 50 తులాల వెండిని.. దొంగలు అపహారించినట్టు గుర్తించారు.

వీడియో చూడండి..

అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. దొంగలు.. దొంగతనం అనంతరం ఇంట్లోనుంచి వెళ్లే సమయంలో ఇంట్లోఉన్న బండరాళ్లపై మొత్తం కొబ్బరి నూనెను చల్లారు. అలా ఇల్లు మొత్తం చల్లి వెళ్లిపోయారు. అయితే.. బాధితుడు ఉస్మాన్ ఫిర్యాదు మేరకు.. పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.