AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులు కూడా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో!

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులు కూడా.. వెదర్ రిపోర్ట్ ఇదిగో!
Rains Forecast
Follow us
Ravi Kiran

|

Updated on: May 23, 2023 | 4:48 PM

రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ/నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడతాయన్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చునన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అటు ఈదురుగాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపారు.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు ఏమి లేదు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ———————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.

రాయలసీమ:- —————————————————-