ఊపిరిపోతున్నా.. వీడని డ్రైవింగ్ పటిమ..! సలాం చేయాల్సిందే..

అతను ఓ డ్రైవర్.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారికి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది.. భరించలేని గుండె నొప్పి.. ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. కానీ చేతిలో స్టీరింగ్.. కాస్త పట్టు తప్పితే.. నడిరోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు బలైపోతాయి. అయినా ఓర్చుకున్నాడు. గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి.. వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు. అంతబాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి.. ఊపిరి వదిలేసాడు. డ్రైవర్ క్యాబిన్లోనే స్టీరింగ్‎పై వాలి ప్రాణాలు కోల్పోయాడు.

ఊపిరిపోతున్నా.. వీడని డ్రైవింగ్ పటిమ..! సలాం చేయాల్సిందే..
Lorry Driver
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 25, 2024 | 9:48 PM

అతను ఓ డ్రైవర్.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారికి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది.. భరించలేని గుండె నొప్పి.. ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది. కానీ చేతిలో స్టీరింగ్.. కాస్త పట్టు తప్పితే.. నడిరోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు బలైపోతాయి. అయినా ఓర్చుకున్నాడు. గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి.. వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు. అంతబాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి.. ఊపిరి వదిలేసాడు. డ్రైవర్ క్యాబిన్లోనే స్టీరింగ్‎పై వాలి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు పోయే సమయంలోను బాధ్యతగా వ్యవహరించిన ఆ డ్రైవర్ను అంతా సలాం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

విశాఖ గాజువాక ఆటోనగర్‎కు చెందిన నరవ శ్రీనివాసరావు గ్యాస్ సిలిండర్ల వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యాడు. ఫిల్లింగ్ చేసిన 300 సిలిండర్లను లోడ్ చేసుకున్నాడు. పారిశ్రామిక వాడలోని వీడీఆర్ గొడౌన్ మీదుగా మల్కాపురం వైపు వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో చమురు కంపెనీలు ఉన్నాయి. ఇంధన గొడౌన్లు కూడా ఉండే ప్రాంతం అది. వాహనం మారుతి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా గుండెలో నొప్పి ప్రారంభమైంది. ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తోంది. అంత బాధలోనూ తన వల్ల మరొకరికి ప్రమాదం జరగకూడదని భావించాడు. వాహనం కంట్రోల్ తప్పుతుందో ఏమోనని గుర్తించి.. అతి కష్టంపై డివైడర్ పైకి చేర్చాడు. ఆ వెంటనే స్టీరింగ్ మీద వాలి పోయి ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళ్తున్నవారు గమనించి.. డ్రైవర్ను బయటకు తీశారు. 108 వాహనానికి, మల్కాపురం పోలీసులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది డ్రైవర్ శ్రీనివాస్‎ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

పెను ముప్పు నుంచి కాపాడాలని ఆ తపన..

ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో చమురు పరిశ్రమలు ఉన్నాయి. హెచ్ పీ పెట్రో పార్కు కంపెనీ, బీపీసీఎల్, ఈపీఎల్ ఆయిల్ పరిశ్రమలు, రసాయనాలతో ఉన్న గొడౌ‎న్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ప్రమాదంలో వాహనం అదుపుతప్పి.. వాహనం బోల్తాపడితే గ్యాస్ సిలిండర్లు పేలి పెను ప్రమాదమే జరిగేది. ఆ ముప్పు నుంచి కాపాడాడు డ్రైవర్. ప్రాణాలు పోయే సమయంలోనూ డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించిన తీరుతో అంతా సలాం కొడుతున్నారు. తన ప్రాణాలు పోతున్న.. నలుగురి ప్రాణాలను రక్షించేందుకు ఆలోచించిన ఆ డ్రైవర్ శ్రీనివాస్ రియల్ హీరో అంటున్నారు స్థానికులు. శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెం. దురదృష్టవశాత్తు అంతటి మంచి ఆలోచన ఉన్న ఆ డ్రైవర్ ప్రాణాలకు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!