ఐఏఎస్ సంతకం ఫోర్జరీ.. కష్టాల్లో నగర మేయర్.. ఏం జరిగిందంటే..

నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతున్నాయి. మేయర్ భర్త ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో నిండాతుడిగా ఉన్నారు. నేడో, రేపో అరెస్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కష్టాల నుంచి బయటపడేందుకు మేయర్ టీడీపీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ నెల్లూరు మేయర్‎ను అంతలా వెంటాడుతున్న ఆ సమస్యలు ఏంటి.? నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసిపి వశమైంది మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం స్రవంతిని వరించింది.

ఐఏఎస్ సంతకం ఫోర్జరీ.. కష్టాల్లో నగర మేయర్.. ఏం జరిగిందంటే..
Nellore
Follow us
Ch Murali

| Edited By: Srikar T

Updated on: Jul 25, 2024 | 9:15 PM

నెల్లూరు మేయర్ స్రవంతిని కష్టాలు వెంటాడుతున్నాయి. మేయర్ భర్త ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసులో నిండాతుడిగా ఉన్నారు. నేడో, రేపో అరెస్టు అన్నట్లుగా ఉంది పరిస్థితి. కష్టాల నుంచి బయటపడేందుకు మేయర్ టీడీపీ ముఖ్యనేతలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతకీ నెల్లూరు మేయర్‎ను అంతలా వెంటాడుతున్న ఆ సమస్యలు ఏంటి.? నెల్లూరు కార్పొరేషన్ గత ఎన్నికల్లో వైసిపి వశమైంది మొత్తం 54 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అదృష్టం స్రవంతిని వరించింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడం, కార్పొరేషన్‎లో జరిగిన తప్పిదాలు ఇప్పుడు ఆమెను అటు రాజకీయంగా.. ఇటు కేసులు పరంగా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కార్పొరేషన్‎లో కొన్ని ఫైల్స్ సంతకాల విషయంలో ఫోర్జరీకి పాల్పడ్డారన్న విషయం రాజకీయంగా దుమారం చెలరేగింది. ఎన్నికల ముందే ఈ ఆరోపణలు వచ్చాయి.

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దీనిపై ప్రాథమిక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలు ఫోర్జరీ అయినట్లు గుర్తించారు. కార్పొరేషన్ పరిధిలో జరిగిన అపార్ట్మెంట్ల తాలూకు మార్ట్గేజ్ ఫైల్స్‎ను క్లియర్ చేసేందుకు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం బయటపడింది. నాలుగు ఫైళ్లు ఈ విధంగా ఫోర్జరీ సంతకాలతో విడుదల అయినట్టు తెలిసింది. కమిషనర్ వికాస్ మరమ్మత్ తన సంతకం ఫోర్జరీ అయినట్టు విచారం జరపాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణలో ఐఏఎస్ అధికారి సంతకం ఫోర్జరీ జరిగినట్లు గుర్తించారు. ఇందులో మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్.. అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బంది హస్తం ఉన్నట్టు తేలడంతో జిల్లా ఎస్పీకి నెల్లూరు కమిషనర్ ఫిర్యాదు చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు మొదటగా ఏడుగురి పాత్ర ప్రధానంగా ఉన్నట్లు గుర్తించారు. మేయర్ భర్త జయవర్ధన్ ప్రోద్బలంతో ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల ఆర్జించినట్లు గుర్తించారు.

ఈ స్కాంలో వీళ్లంతా కలిసి కోట్లాది రూపాయలు లబ్ధి పొందడంతో పాటు.. కార్పొరేషన్‎కు రావాల్సిన కోట్ల విలువైన రుసుములు రాకుండా పోవడం గమనార్హం. విచారణలో భాగంగా జయవర్ధన్‎తో పాటూ నలుగురు కార్పొరేషన్ సిబ్బంది, మరో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జయవర్ధన్‎ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే మేయర్ భర్త ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. చెన్నైలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు ఫలితం లేకపోయింది. కేసులు అరెస్టులనుంచి తప్పించుకునేందుకు మేయర్ స్రవంతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు అలాగే నారా లోకేషన్ కూడా కలిసేందుకు స్రవంతి తనకున్న పరిచయాలతో అమరావతిలో గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలే తమను ఈ కష్టాల నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేసేందుకు అమరావతిలోనే తిష్ట వేసినట్టు సమాచారం. కార్పొరేషన్‎కు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడం.. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్ జివి చేయించి తద్వారా లబ్ధి పొందడం అనేది తీవ్రమైన కేసుగా పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..