AP Weather: ఏపీలో వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది…
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం….
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
సోమ, మంగళ, బుధ :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
సోమవారం- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం, బుధవారం :- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది
రాయలసీమ :-
సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బుధవారం:- వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి