Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెళ్లింట పిడుగు లాంటి విషాదం.. ఊరుఊరంతా శోకసంద్రమే!

వారిది కడు పేద కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచారు. కూడబెట్టిన సొమ్ముతో రెండో కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే ఆ ఇంట పచ్చని తోరణాలు వాడక ముందే దారుణం చోటు చేసుకుంది. చెప్పాపెట్టకుండా వచ్చిన వాన మోయలేనంత విషాదం మిల్చివెళ్లింది. అసలేం జరిగిందంటే..

Andhra Pradesh: పెళ్లింట పిడుగు లాంటి విషాదం.. ఊరుఊరంతా శోకసంద్రమే!
Lightning Claims Woman Life
Follow us
Gamidi Koteswara Rao

| Edited By: Srilakshmi C

Updated on: Jun 07, 2025 | 8:36 PM

విజయనగరం, జూన్‌ 7: విజయనగరం జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. తెర్లాం మండలం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన రామిశెట్టి అనే దుస్తుల వ్యాపారి జీవనోపాధి కోసం బట్టలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య పి వెంకటమ్మ (42) ఇంట్లోనే ఉంటూ, ఇద్దరు ఆడపిల్లలు, పశువుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఎంతో కష్టపడి, పైసా పైసా కూడ పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు. అందులో భాగంగా రెండో కుమార్తె గౌరి పెళ్లి మే 20న ఘనంగా జరిగింది. వీరి ఇంట్లో పెళ్లి లాంఛనాలు, పెళ్లి సందడి ముగియక ముందే విషాదం వీరి కుటుంబాన్ని చుట్టుముట్టింది.

శుక్రవారం రోజు వెంకటమ్మ ఇంటికి సమీపంలోని పశువులశాలలో ఉన్న పశువులకు దాణా పెడుతుండగా, అకాల వానలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పిడుగు ప్రమాదంతో ఒక సామాన్య కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండో కుమార్తె వివాహం జరిగిన కుటుంబంలో తల్లి మరణం కుటుంబ సభ్యులను కుంగదీసింది. పచ్చని పందిరి వేసిన అదే ప్రాంగణంలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగింది. ప్రభుత్వం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంకట లక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?