Srisailam: శ్రీశైలంలో కనిపించిన అరుదైన పునుగు పిల్లి.. శుభ సంకేతమంటోన్న అర్చకులు, భక్తులు
శ్రీశైల మహాక్షేత్రంలో ఉచిత దర్శన క్యూలో వెళ్లే భక్తులకు పునుగు పిల్లి సందడి చేస్తూ కనిపించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరు పునుగు పిల్లి సందడిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అయితే క్యూలైన్ లో భక్తుల సందడితో పునుగు పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
శ్రీశైల మహాక్షేత్రంలో ఉచిత దర్శన క్యూలో వెళ్లే భక్తులకు పునుగు పిల్లి సందడి చేస్తూ కనిపించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరు పునుగు పిల్లి సందడిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అయితే క్యూలైన్ లో భక్తుల సందడితో పునుగు పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలో పునుగు పిల్లలు ఆలయ ప్రాంగణం అభివృద్ధి చెందక ముందు కల్యాణమండపం, నాగులకట్ట, పరిసరాల్లో అనేక పునుగు పిల్లులు కనిపించేవి. అయితే కాల క్రమేణ ఆయా ప్రదేశాల్లో యాగశాల, కల్యాణకట్ట, అన్న పూర్ణదేవాలయం, తదితర అభివృద్ధి పనులు చేపట్టడంతో పునుగు పిల్లుల జాడ కనిపించకుండా పోయింది. చాలా రోజుల తర్వాత పునుగు పిల్లి కనిపించడం శుభసూచికమని స్థానికులు, దేవస్థానం ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పునుగు పిల్లి జాతి క్రమంగా అంతరించిపోతోందని వాటి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి విజయవాడ దుర్గ గుడి దగ్గర కనిపిస్తే పట్టుకెళ్ళి టీటీడీ అడవుల్లో వదిలిపెట్టారట. తిరుమల శ్రీవారి అభిషేక సమయంలో సుగంధ ద్రవ్యాలలో పరిమళ o వెదజల్లేందుకు ఈ పునుగు పిల్లిని ఉపయోగిస్తారని చెప్తుంటారు. ఈ పునుగుపిల్లి తైలాన్ని అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహానికి పుస్తారని చెబుతుంటారు.
కాగా పునుగు పిల్లి జాతి అంతరించిపోకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇది అడవుల్లో ఉండాల్సిన పునుగు పిల్లులను ఒకచోట బంధించడం నేరమని అప్పట్లో కొందరు వాదించారు అయితే ప్రభుత్వం చట్టానికి సవరణ తెచ్చి దేవాలయ సంబంధ వాటికి ఉపయోగించవచ్చని చెప్పడంతో అప్పటినుంచి పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జాతి అంతరించిపోకుండా క్రమంగా వృద్ధి చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిద్దాం. మొత్తం మీద శక్తి పీఠము జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో భక్తులకు అది కూడా క్యూలైన్లలో పునుగుపిల్లి దర్శనం ఇవ్వడం పట్ల హర్షం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..