AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగా పడుకున్న మహిళను టార్గెట్ చేశాడు.. కట్ చేస్తే అరగుండు.. మెడలో చెప్పుల దండ..

కర్నూలు జిల్లా అరికెరలో అత్యాచారయత్నానికి పాల్పడిన రాజశేఖర్‌ను గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించకుండా, అతనికి అరగుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేసి, బట్టలు విప్పి ఊరంతా ఊరేగించారు. నిందితుడు, బాధితులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

ఒంటరిగా పడుకున్న మహిళను టార్గెట్ చేశాడు.. కట్ చేస్తే అరగుండు.. మెడలో చెప్పుల దండ..
Crime News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 07, 2026 | 4:51 PM

Share

అరగుండు.. మెడలో చెప్పుల దండ.. అర్ద నగ్న ప్రదర్శన.. ఇలా ఎందుకు జరిగింది.. అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చదవాల్సిందే.. అరగుండు పరమేశం మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.. అయితే.. అతను చేసిన పనికి.. తగిన శాస్తి జరగిందని గ్రామస్థులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామస్తుడు రాజశేఖర్ చూడటానికి బాగానే ఉంటాడు.. కానీ.. దుర్మార్గుడు.. మహిళలను టార్గెట్ చేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు.. తాజాగా.. వివాహిత మిద్దెపై పడుకుని ఉండగా అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన వివాహిత బంధువులు రాజశేఖర్ ని చుట్టుముట్టారు. పట్టుకొని బంధించి గ్రామ శివారులలోకి తీసుకెళ్లారు. అరగుండు చేశారు. మీసం కూడా సగం తీసేసారు. అండర్వేర్ మినహా బట్టలన్నీ విప్పేశారు. మెడలో చెప్పులు దండ వేశారు. దేహశుద్ధి చేశారు.

ఇంతటితో ఆగకుండా ఊర్లో ఊరేగించారు. వివాహితది నిందితుడిది వేరువేరు సామాజిక వర్గాలు. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య అప్పటికే ఆ గ్రామంలో కొంత వివాదం ఉండేది. తాజా సంఘటనతో రెండు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులలో వరకు వెళ్లకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తక్షణశిక్ష విధించారు గ్రామస్తులు. తర్వాత పోలీసులు గ్రామానికి వెళ్లి విచారించారు. గ్రామంలో మరొకరు పరాయి స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఇదే శిక్ష ఉంటుందనే సంకేతాలు ఇచ్చామని గ్రామస్తులు అంటున్నారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us