AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్తీ కారం పొడిని ఇంట్లోనే కనిపెట్టే సింపుల్ టిప్స్ ఇవే.. ఇలా చేస్తే ఒక్క నిమిషంలోనే గుట్టు రట్టు..

చికెన్ కూరలైనా, ఘాటైన చేపల పులుసైనా.. ముక్కకు కారం పడితేనే ఆ రుచే వేరు. కానీ మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే వంటల్లో వాడే ఆ కారం పొడి అసలైనదేనా? లేక మన ప్రాణాలనే తీసే నకిలీదా? ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న కల్తీల వ్యవహారం చూస్తుంటే ఈ డౌట్లు రావడం కామన్. మీరు వాడుతున్న కారం పొడి స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం..

కల్తీ కారం పొడిని ఇంట్లోనే కనిపెట్టే సింపుల్ టిప్స్ ఇవే.. ఇలా చేస్తే ఒక్క నిమిషంలోనే గుట్టు రట్టు..
How To Check Red Chili Powder Purity At Home
Krishna S
|

Updated on: May 31, 2026 | 1:20 PM

Share

మన దేశంలో కారం పొడి లేకుండా ఏ వంటా పూర్తి కాదు. కూరలకు చక్కటి రంగు, ఘాటైన రుచిని జోడించడానికి ప్రతి ఒక్కరూ కారన్ని అత్యధికంగా ఉపయోగిస్తారు. రుచికరమైన చేపల పులుసు నుండి ఘాటైన చికెన్ కూరల వరకు.. కారం పొడి పడితేనే ఆ కిక్కే వేరు. అయితే పూర్వం లాగా మిరపకాయలు కొని, ఎండబెట్టి, మిల్లు ఆడించే ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. చాలామంది మార్కెట్లో దొరికే ప్యాకెట్ కారం పొడిపైనే ఆధారపడుతున్నారు. కానీ నేడు మార్కెట్లో లభించే కారం పొడిలో విపరీతంగా కల్తీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కేవలం లాభాల కోసం కొందరు మోసగాళ్లు కారం పొడిలో ఇటుక పొడి, ఇసుక, సుద్ద పొడి, రంపపు పొడి, ప్రమాదకరమైన కృత్రిమ రంగులను కలుపుతున్నారు.

కల్తీ కారంతో ప్రాణాంతక వ్యాధులు

ఈ కల్తీ కారం పొడిని లాంగ్ టర్మ్ వాడటం వల్ల కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • తీవ్రమైన గుండెల్లో మంట, అజీర్ణం.
  • కాలేయం, మూత్రపిండాల వ్యాధులు.
  • చివరికి క్యాన్సర్ వంటి భయంకరమైన మహమ్మారి బారిన పడే ప్రమాదం కూడా ఉంది.

కానీ ఇకపై దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బాస్. మీరు కొనుగోలు చేసే కారం పొడి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి ఇంట్లోనే చేసుకోగల కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

కల్తీ కారాన్ని కనిపెట్టే 4 సులభమైన ఇంటి చిట్కాలు

నీటి పరీక్ష

కారం పొడిలో ఉండే ఇటుక పొడి, ఇసుక మరియు రంగులను గుర్తించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.

ఎలా చేయాలి?: ముప్పావు గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ కారం పొడి వేసి, నెమ్మదిగా వదిలేయండి.

ఫలితం: మంచి కారం పొడి నీటిలో త్వరగా మునిగిపోదు. కాసేపు నీటిపై తేలుతూ ఉంటుంది. ఒకవేళ అది నకిలీదైతే.. చాలా వేగంగా గ్లాసు అడుగుకు చేరుకుని, అక్కడ ఒక మందపాటి పొరలా పేరుకుపోతుంది.

చేత్తో రుద్ది చూడండి

ఎలా చేయాలి?: కొద్దిగా కారం పొడి తీసుకుని మీ అరచేతుల మధ్య వేళ్లతో బాగా రుద్దండి.

ఫలితం: రుద్దినప్పుడు ఆ పొడి మీ చేతులకు గరుకుగా తగిలితే, అందులో ఇటుక పొడి లేదా ఇసుక కలిపారని అర్థం. ఒకవేళ అది చాలా మెత్తగా, సబ్బు పొడిలా జారుడుగా అనిపిస్తే.. అందులో సబ్బురాయి లేదా సుద్ద పొడి కలిపి ఉండే అవకాశం ఉంది.

నూనె పరీక్ష

ఎలా చేయాలి?: ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకుని అందులో కొద్దిగా కారం పొడి కలపండి.

ఫలితం: నూనెలో కారం వేయగానే అది వెంటనే ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారిపోతే, అందులో కృత్రిమ రంగు కలిపారని గ్రహించాలి. ఎందుకంటే స్వచ్ఛమైన కారం పొడి తన రంగును నూనెలోకి విడుదల చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది.

రంపపు పొడి – చెక్క పొడి పరీక్ష

ఎలా చేయాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కారం పొడి వేసి బాగా కలపండి.

ఫలితం: కొంత సమయం తరువాత, ఒకవేళ అందులో చెక్క పొడి కలిసి ఉంటే.. ఆ చెక్క రేణువులు నీటిపై తేలుతాయి. స్వచ్ఛమైన కారం పొడి రేణువులు ఈ విధంగా నీటిపై తేలవు.

సురక్షితంగా ఉండటానికి స్మార్ట్ టిప్స్

మార్కెట్లో కారం పొడి కొనేటప్పుడు కేవలం కలర్ చూసి మోసపోకండి. ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్లను లేదా FSSAI లోగో ఉన్న ప్యాకెట్లను మాత్రమే ఎంచుకోండి. లేబుల్ లేకుండా లూజ్‌గా అమ్మే పొడులను అస్సలు వాడకండి. వీలైతే, మార్కెట్ నుండి మంచి నాణ్యత గల ఎండు మిరపకాయలను కొని.. వాటిని శుభ్రంగా కడిగి, ఎండబెట్టి, మిల్లులో ఆడించుకోవడం అన్నిటికంటే సురక్షితమైన మార్గం.

Follow Us