AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు మరిన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో జూన్‌లోనూ వేడి వాతావరణం కొనసాగుతుందని, అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Forecast
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2026 | 1:26 PM

Share

ఓవైపు ఎండలు మరోవైపు… మరోవైపు వర్షాలు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితి. తెలంగాణను హీట్‌వేవ్ భయపెడుతుంటే.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరింది. ఇవాళ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కేరళ తీరానికి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో జూన్‌లో కూడా ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ నెలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం వల్ల వేడి వాతావరణం ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఒకవైపు రుతుపవనాల ఆగమనం, మరోవైపు హీట్‌వేవ్ పరిస్థితులు ఒకేసారి నెలకొనే విచిత్ర వాతావరణం కనిపించనుంది. జూన్ నెలలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండనుంది. అక్కడ సాధారణం కంటే 45% నుండి 55% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని అంచనా.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విదర్భ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలలోసముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం (cyclonic circulation) ఏర్పడి ఉంది. విదర్భ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, పశ్చిమ-మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి (trough) కొనసాగుతోంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి రేపు నుండి నాలుగు రోజుల వరకు క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us