AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఆదివారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలు కలిసి వింత వాతావరణ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరోవైపు పలుచోట్ల వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని APSDMA హెచ్చరించింది. తెలంగాణలోనూ జూన్ 3 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఆదివారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2026 | 8:11 AM

Share

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఒకవైపు ప్రచండ ఎండలు.. మరోవైపు వర్షాలు కురుస్తు్న్నాయి.. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై .. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ఓ వైపు ఎండలు వడగాలులతో పాటు.. మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఏపీలో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని.. APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆదివారం (31-05-2026) అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఆకస్మికంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు పలు 17 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపారు. అదేసమయంలో రాష్ట్రంలో ఎండలు స్వల్పంగా తగ్గి కొన్నిచోట్ల 42°-44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. అయితే.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, రైతులు, పశుకాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ఇదిలాఉంటే.. తెలంగా రాష్ట్రంలో జూన్ 3 వరకు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని.. తెలిపింది. అంతేకాకుండా.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే
పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..! లేదంటే
పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..! లేదంటే
ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?