AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 Answer Key: నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌ మార్కులు! ఎందుకంటే

నీట్‌ యూజీ 2026 మే 3న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నీట్‌ ప్రశ్నాపత్రం కాస్త సులువుగానే వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. దీంతో 2025తో పోల్చితే ఈ సారి కటాఫ్‌ పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా..

NEET UG 2026 Answer Key: నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌ మార్కులు! ఎందుకంటే
NEET UG Answer Key released
Srilakshmi C
|

Updated on: May 07, 2026 | 4:30 PM

Share

హైదరాబాద్‌, మే 7: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష నీట్‌ యూజీ 2026 మే 3న దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నీట్‌ ప్రశ్నాపత్రం కాస్త సులువుగానే వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. దీంతో 2025తో పోల్చితే ఈ సారి కటాఫ్‌ పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నీట్‌ యూజీ పరీక్ష ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని ఎన్టీయే విడుదల చేసింది. అన్ని సిరీస్‌ల ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఆన్సర్‌ కీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది.

నీట్‌ యూజీ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఈ ఏడాది నీట్‌ యూజీ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 22.79 లక్షల మంది విద్యార్దులు హాజరయ్యారు. వీరందరికీ 5,432 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీలను తాజాగా ఎన్టీయే విడుదల చేసింది. తొలుత స్కాన్‌ చేసిన ఓఎంఆర్‌ షీట్‌లను అప్‌లోడ్‌ చేస్తామని, ఆ తర్వాతే అభ్యంతరాలు తెలిపేందుకు విండోను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ఎన్‌టీఏ తన ప్రకటనలో తెలిపింది. నీట్‌ పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఇతర సందేహాలు ఉంటే 011-40759000 /011-69227700 నంబర్లను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు లేదా ఈ-మెయిల్‌ neetug2026@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2026 ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నీట్ యూజీ పేపర్‌ తేలికగా ఉన్నందున కటాఫ్‌లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. పేపర్‌ మధ్యస్థంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే రకమైన మార్కులు సాధిస్తారు. దీంతో కటాఫ్‌లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us