Andhra Pradesh: పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతా.. కోడెల శివరాం వార్నింగ్..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టిడీపీ ఇంఛార్జి పదవి.. కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వటంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం టీడీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో టీడీపీలో ఉంటూనే అభిమానులను, కార్యకర్తలను కలుస్తున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టిడీపీ ఇంఛార్జి పదవి.. కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వటంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం టీడీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో టీడీపీలో ఉంటూనే అభిమానులను, కార్యకర్తలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ముప్పాళ్ళ మండలం రుద్రవరంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ సమయంలో గ్రామానికి చెందిన యార్లగడ్డ పద్మారావు.. తనకి కోడెల శివరాం 60లక్షల డబ్బులివ్వాలని అవి ఇచ్చిన తర్వాతే విగ్రహావిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల సాయంతో శివరాం కోడెల విగ్రహావిష్కరణ చేశారు.
అయితే కొంతమంది తనపై అసత్య ప్రచారం, ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని శివరాం ఆరోపించారు. ఇప్పటివరకూ చూస్తూ ఊరుకున్నానని ఇక నుండి సహించేది లేదని తేల్చి చెప్పారు. వారిని బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతా అంటూ హెచ్చరించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసే పిచ్చి పనులు మానుకోవాలంటూ సూచించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి వెనుక ఉన్నదెవరో తనకు తెలుసన్నారు. తన మీద ఆరోపణలు చేసే ముందు వారి వద్ద ఆధారాలుంటే ముందు పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. దమ్ము,ధైర్యం ఉంటే ఆధారాలు బయట పెట్టండి లేకుంటే నోర్మూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన వెనక కోడెల అభిమానులున్నారని, నా కుటుంబంపై అవాకులు, చెవాకులు పేలితే అభిమానులు బాధపడతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అయితే కోడెల వార్నింగ్ తో సత్తెనపల్లి రాజకీయాలు మరింత హీటెక్కాయి.
(రిపోర్టర్: టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.