JP Nadda: తిరుపతిలో జేపీ నడ్డా.. సాయంత్రం భారీ బహిరంగ సభ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ దూకుడు పెంచుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో నడ్డా శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ దూకుడు పెంచుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో నడ్డా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుచానూరులో కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం శ్రీకాళహస్తిలో భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు.
అయితే ఇప్పటికే ఏపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు సోము వీర్రాజు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభలో ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై జేపీ నడ్డా ప్రజలకు వివరించనున్నారు. బహిరంగ సభ అనంతరం తిరిగి ఢిల్లీకి నడ్డా వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా రేపు విశాఖపట్నంలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.