Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ సమయాల్లో మార్పు.. కారణమిదే.!
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20833) ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. జూన్ 10వ తేదీన ట్రైన్ సమయాల్లో మార్పులు జరిగాయి.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20833) ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. జూన్ 10వ తేదీ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన ఈ ట్రైన్.. 4 గంటలు ఆలస్యంగా ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరుతుందని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలే ఈ వందేభారత్ ట్రైన్ ఆలస్యానికి కారణమని.. ప్రయాణీకులు ఇది గమనించాల్సిందిగా ఆయన కోరారు. ఇలా చూసుకుంటే.. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లకు ఈ ట్రైన్ అనుకున్న సమయం కంటే.. ఆలస్యంగా చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌కు సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుందని తెలుస్తోంది. అటు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగా నడుస్తుందని.. విశాఖపట్నానికి అర్ధరాత్రి చేరుకునే ఛాన్స్ ఉంది.
#RESCHEDULING OF 20833 Visakhapatnam-Secunderabad VANDE BHARAT express leaving Visakhapatnam on 10.06.23 is rescheduled to leave at 09:45hrs on 10.06.23 Instead of its scheduled departure at 05:45hrs. @RailMinIndia @EastCoastRail @drmvijayawada @drmsecunderabad @SCRailwayIndia pic.twitter.com/jnhdVVo6rK
— DRMWALTAIR (@DRMWaltairECoR) June 9, 2023