Andhra Pradesh: అందువల్లే అప్పుడు ఓడిపోయాం.. టీడీపీ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో ధీమా, అహంకారం, గెలుస్తామనే బలుపుతో పార్టీ ఓడిపోయిందన్నారు. పథకాలు ఇచ్చాం, వీర పథకాలు ఇచ్చాం, వీర తిలకాలు దిద్దుకొని ఊరేగామన్నారు. కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ అని వైసీపీ పార్టీ గెలిచిందని ఆ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో ధీమా, అహంకారం, గెలుస్తామనే బలుపుతో పార్టీ ఓడిపోయిందన్నారు. పథకాలు ఇచ్చాం, వీర పథకాలు ఇచ్చాం, వీర తిలకాలు దిద్దుకొని ఊరేగామన్నారు. కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ అని వైసీపీ పార్టీ గెలిచిందని ఆ పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే మైలవరం, నందిగామలోని వైసీపీ నేతలపై దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరంలో తండ్రి కొడుకులు, నందిగామలో వసూల్ బ్రదర్స్ కొండలు, గుట్టలు తవ్వి దోచుకుంటున్నారని విమర్శించారు. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు నెలకు 7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం