Kodali Nani: ఈసారి ఇంటికి వెళ్లడం ఖాయం.. బాలయ్య, చంద్రబాబుపై కొడాలి నాని సంచలన కామెంట్స్..
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే ఎవరితో టచ్‌లో ఉన్నారు? ఎవరు గోడ దూకబోతున్నారు? అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలతో ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది. తాజాగా, దీనికి మాజీ మంత్రి కొడాలినాని ఇచ్చిన కౌంటర్‌తో అది పీక్స్‌కు చేరింది.

ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ.. అధికార పార్టీపై విరుచుకుపడుతోంది. అందులో భాగంగానే.. వైసీపికి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ.. టీడీపీ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. నిజంగానే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. టీడీపీ వైపు చూస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది. చంద్రబాబు, బాలకృష్ణలు సైతం ఆఫ్ ది రికార్డు.. ఈ తరహా వ్యాఖ్యలే చేయడం.. ఏపీలో పొలిటికల్‌గా దుమారం రేపుతోంది.
తాజాగా, చంద్రబాబు ఆయన బావమర్ది బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నా… జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన.. ఎన్నికల వేళ లీడర్లెవరైనా.. ప్రజలతో టచ్‌లో ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
పనిలో పనిగా బాలయ్యకూ చురకలంటించారు కొడాలి నాని. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో… జగన్‌పై బాలయ్య చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చిపడేశారు.




ఎవరు కామెంట్ చేసినా సరైన నాయకుడు కౌంటరిస్తే ఆ కిక్కే వేరు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై కొడాలి ఎదురుదాడితో ఇప్పుడదే జరిగింది. వ్యహారం పీక్స్‌కు చేరింది. రాజకీయంగా ఇది ఏ మలుపు తీసుకుంటుందనేది చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..
