TDP Vs YCP: తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర హీట్.. క్యాంప్‌ దగ్గరకు వచ్చిచూడంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసి వార్నింగ్‌

నువ్వొకటంటే నేను అంతకుమించి అంటానంటూ రెచ్చిపోయారు ప్రభాకర్‌రెడ్డి. అసలు, తాడిపత్రి సెంటర్లోకొస్తే పంచె ఊడిదీసి కొట్టడానికి జనం రెడీగా ఉన్నారంటూ పెద్దారెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు. లోకేష్‌ యాత్రను అడ్డుకునే దమ్ముందా!, అసలు లోకేష్‌ క్యాంప్‌ దగ్గరకు వచ్చిచూడు, నీకు ఏమవుతుందో తెలుస్తుందంటూ ఒక రేంజ్‌లో కౌంటర్‌ మీద కౌంటర్లిచ్చారు ప్రభాకర్‌రెడ్డి.  

TDP Vs YCP: తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర హీట్.. క్యాంప్‌ దగ్గరకు వచ్చిచూడంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసి వార్నింగ్‌
Jc And Ketireddy
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2023 | 7:16 AM

టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజక వర్గంలో ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో పోటికల్ హీట్ పెంచింది. తాడిపత్రి అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి .. ప్రతిపక్ష నేత జేసి ప్రభాకర్ రెడ్డిలు రాజకీయ పౌరుషంతో రగిలిపోతున్నారు. తాడిపత్రిలోని సీబీ రోడ్‌లో పొలిటికల్‌ కౌంటర్లతో రచ్చ లేపుతున్నారు. ఎప్పుడూ ఒకరికొకరు తిట్టుకునే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య ఇప్పుడు నారా లోకేష్‌ పాయింట్‌ నిప్పు రాజేసింది.

భూకబ్జాలు చేశామ్‌ అంటావా!. ఏదీ ఎక్కడో చూపించు!. నీకు దమ్ముంటే ఆధారాలతో రా!. నేను తప్పు చేశారని నిరూపించు! స్పాట్‌లో సారీ చెబుతా! లేదంటే తాడిపత్రిలో పాదయాత్ర బంద్‌ చెయ్‌!, నోర్మూసుకొనిపో!. ఇదీ నారా లోకేష్‌ టార్గెట్‌గా తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి విసిరిన సవాల్‌!. ఆధారాల్లేకుండా ఆరోపణలుచేస్తే మాత్రం సహించేదే లేదు, లోకేష్‌ దగ్గరే తేల్చుకుంటానంటూ అల్టిమేటం ఇచ్చారు పెద్దారెడ్డి. అసలు, నీ పక్కనున్న జేసీ బ్రదర్స్‌ భూకబ్జాల గురించి తెలుసా!. జూటూరు గ్రామస్తులను అడుగు… ఎన్ని వందల ఎకరాలు దోచేశారో చెబుతారన్నారన్నారు కేతిరెడ్డి. జేసీ బ్రదర్స్‌ భూకబ్జాలపై ఆధారాలు కావాలంటే చెప్పు నేనిస్తా!. ఎంతోమంది టీడీపీ కార్యకర్తలను చంపిన చరిత్ర జేసీ కుటుంబానిది!. ఇవన్నీ ఎలా మర్చిపోయావ్‌ లోకేష్‌ అంటూ ప్రశ్నించారు పెద్దారెడ్డి.

కేతిరెడ్డి ఈ రేంజ్‌లో రెచ్చిపోయాక.. జేసీ ప్రభాకర్‌ ఊరుకుంటారా.. పైగా ఎన్నో దశాబ్ధాల నుంచి తాడిపత్రి రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపించిన జేసీకి పౌరుషం తన్నుకురాదా!. నువ్వొకటంటే నేను అంతకుమించి అంటానంటూ రెచ్చిపోయారు ప్రభాకర్‌రెడ్డి. అసలు, తాడిపత్రి సెంటర్లోకొస్తే పంచె ఊడిదీసి కొట్టడానికి జనం రెడీగా ఉన్నారంటూ పెద్దారెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు. లోకేష్‌ యాత్రను అడ్డుకునే దమ్ముందా!, అసలు లోకేష్‌ క్యాంప్‌ దగ్గరకు వచ్చిచూడు, నీకు ఏమవుతుందో తెలుస్తుందంటూ ఒక రేంజ్‌లో కౌంటర్‌ మీద కౌంటర్లిచ్చారు ప్రభాకర్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

తనపై అసత్య ఆరోపణలుచేస్తే లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామనేది MLA పెద్దారెడ్డి అల్టిమేటం, దమ్ముంటే అడ్డుకో అనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌంటర్‌!. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గట్లేదు!. ఇద్దరూ కూడా తొడలు కొడుతూ మీసాలు తిప్పుతున్నారు!. దమ్ముంటే రా… నీ పెతాపమో.. నా పెతాపమో చూసుకుందామంటున్నారు. మరి, పెద్దారెడ్డి – ప్రభాకర్‌రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల యుద్ధం ఎక్కడివరకూ వెళ్తుందో… ఎటువైపు వెళ్తుందో.. ఎదురుచూడాలి అంతే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో