గ్రామ, వార్డ్ సచివాలయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు
సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జిల్లాలో జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయం 2019 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసి విజయవంతం కావాలని, అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అందరూ కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు:? ? హాల్ టిక్కెట్ లో ఫొటో సరిగా లేకుండా […]

సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జిల్లాలో జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయం 2019 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసి విజయవంతం కావాలని, అర గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అందరూ కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు:?
? హాల్ టిక్కెట్ లో ఫొటో సరిగా లేకుండా ఉంటే 2 ఫోటోలు తెచ్చుకోండి. ఫొటో లేకపోయినా సిగ్నేచర్ (అభ్యర్థుల సంతకం) లేకపోయినా లోపలికి అనుమతించరు.
? అభ్యర్థులు “బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డుల్లో ఒకటి”)ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
? ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
? అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
? అభ్యర్థులకు సమయం తెలిసేలా అరగంటకొకసారి బెల్ కొడతారు.
? పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది.
? పరీక్ష సమయం 150 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
? ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
? ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్ షీట్ ఇస్తారు.
? ఓఎంఆర్ షీట్‌పై వివరాలు సరిచూసుకుని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి.
? పది గంటలకు ప్రశ్నపత్రం అందిస్తారు.
? ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు.
? పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలి.
? మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏ, బీ, సీ, డీ సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ఇస్తారు.
? పరీక్ష అనంతరం ‘కీ’ని పరిశీలించుకోవడం కోసం అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రం నకలును తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తారు..
? ఆన్సర్స్ ఒకసారి OMR షీట్ పై పెన్ తో బబ్లింగ్ చేస్తే అది రాంగ్ అని మీకు అనిపిస్తే మళ్ళీ దాన్ని మార్చుకునే ఛాన్స్ ఉండదు.. అందుకే కచ్చితమైన ఆన్సర్ ఆలోచించి పెన్ తో బబ్లింగ్ చెయ్యండి..
? ఆన్లైన్ ఎక్సమ్ లో టైం మిగులుతుంది.. కాని ఇప్పుడు OMR షీట్ పై పెన్ తో 150 బిట్స్ బబ్లింగ్ చెయ్యటం వల్ల టైం సరిపోదు.. అందుకే పేపర్ ఒక 15 నిముషాలు ముందుగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోండి…