Kakinada: గొల్లప్రోలులో వింత జంతువు కలకలం.. ప్రజలు బయటకు రావొద్దని సెల్ఫీ వీడియోతో ప్రచారం..

కాకినాడ జిల్లాలో ఓ వింత జంతువు సంచరిస్తుందని పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఓ జంతువుని ఆ వింత జంతువు బలిదీసుకుందని.. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ సెల్ఫీ వీడియోతో ప్రచారం చేస్తున్నారు.

Kakinada: గొల్లప్రోలులో వింత జంతువు కలకలం.. ప్రజలు బయటకు రావొద్దని సెల్ఫీ వీడియోతో ప్రచారం..
Kakinada
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2022 | 3:54 PM

Kakinada: కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వింత జంతువు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లప్రోలు మండలం కొడవలి-పోతులూరు గ్రామంలో పులి సంచరిస్తుందని.. రాత్రిపూట ఎవ్వరూ బయటకు రావొద్దంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. అంతేకాదు ఇదే విషయాన్ని గ్రామ సర్పంచ్‌ సెల్ఫీ వీడియోతో ప్రచారం చేశారు. అయితే, అది పెద్దపులియా..? లేక వింత జంతువా ? అనేది తెలియాల్సి ఉంది. నిన్న ఒక గేదెను చంపేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

ఏలేశ్వరం అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, శరభవరం గ్రామాల్లో కొండలపై మేతకు వెళ్లిన పశువులు కూడా మాయమవుతున్నాయి. చుట్టుపక్కల గాలించడంతో ఒమ్మంగి సరుగుడితోటల్లో రెండు గేదెల కళేబారాలు లభించాయి. పశువులను చంపిన మృగం కోసం ఫారెస్టు సిబ్బంది గాలిస్తున్నారు. సిసి కెమెరాలు పెట్టి వెతుకులాట మొదలుపెట్టారు. తాజాగా శుక్రవారం పోతులూరులో మరో గేదె కళేబరం కనిపించడంతో గ్రామప్రజలు వణికిపోతున్నారు. గేదె మెడపైన గాయాలు, చంపిన తీరును బట్టి పెద్దపులి అయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లేదంటే మరో వింత జంతువుగా కూడా ఫారెస్టు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..