Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరో 10 వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains: వేసవి సీజన్ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Special Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరో 10 వేసవి ప్రత్యేక రైళ్లు
Railway News
Follow us

|

Updated on: May 28, 2022 | 3:28 PM

Railway News: వేసవి సీజన్ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాజీపేట్-తిరుపతి మధ్య 10 వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07091) మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 11 గంటలకు కాజీపేట్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 10.20 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.

అదే తేదీల్లో(మే 31, జూన్ 7,14,21,28) రాత్రి 11.40 గం.లకు ప్రత్యే రైలు (నెం.07092) తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గం.లకు కాజీపేట్‌కు చేరుకుంటుంది.

మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడపనుండగా..ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..