AP News: కడప – తిరుపతి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే… కష్టాలు తీరినట్టే
కడప - రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్ పాస్ (ఎల్ వీయూపి) బ్రిడ్జిలు, 8 వెహికల్ అండర్ పాస్ ( వీయూపీ), 72 మేజర్ అండ్ మైనర్ బ్రిడ్జిలు, 240 కల్వర్టర్లు, 3 రైల్వ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి (అర్ఓబీ)లను నిర్మించనున్నారు. కడప-తిరుపతి ప్రధాన రహదారి ఇప్పటివరకు సరిగా లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇరుకు రోడ్డు... ఎన్నో మలుపులు, నిత్యం ప్రమాదాలకు నెలవుగా కడప తిరుపతి రోడ్డు ఉండేది. తాజాగా ఈ బాధలు అన్ని తీరనున్నాయని స్థానికులే కాదు పక్కరాష్ట్రాలనుంచి వచ్చే ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 9: కడప, రాజంపేట, రైల్వే కోడూరు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. కడప -తిరుపతి గ్రీన్ ఫీల్డ్ హైవే (NH-716) పనులు ప్రారంభమయ్యాయి. రాజంపేట వద్ద ఈ పనులకు సంబంధించిన తొలి అంకం షురూ అయ్యింది. దాదాపు 2,200 కోట్లతో కడప నుంచి తిరుపతి కి 4 లైన్ల రహదారి నిర్మాణం కానుంది. అందులో భాగంగా కూచివారిపల్లె సమీపంలో ఉన్న పాల కేంద్రం పక్కన క్లీన్ అండ్ గ్రబ్బింగ్ పనులను గ్రీన్ ఫీల్డ్ హైవే లైజనింగ్ ఆఫీసర్ హర్షాభిరామ్ అధ్వర్యంలో ప్రారబించారు. క్లీన్ అండ్ గ్రబ్బింగ్ పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి.. 2,200 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు ఒక ప్యాకేజీ కింద, చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 59 కిలో మీటర్ల మేర రెండవ ప్యాకేజీ కింద ఈ హైవే నిర్మాణం జరగనుంది.
హైవే నిర్మాణంలో ప్రత్యేకతులు
కడప – రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్ పాస్ (ఎల్ వీయూపి) బ్రిడ్జిలు, 8 వెహికల్ అండర్ పాస్‌లు ( వీయూపీ), 72 మేజర్ అండ్ మైనర్ బ్రిడ్జిలు, 240 కల్వర్టర్లు, 3 రైల్వ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి (అర్ఓబీ)లను నిర్మించనున్నారు. కడప-తిరుపతి ప్రధాన రహదారి సరిగా లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇరుకు రోడ్డు… ఎన్నో మలుపులు, నిత్యం ప్రమాదాలకు నెలవుగా కడప తిరుపతి రోడ్డు ఉండేది. తాజాగా ఈ బాధలు అన్ని తీరనున్నాయని స్థానికులే కాదు పక్కరాష్ట్రాలనుంచి వచ్చే ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ కింద చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 59 కిలో మీటర్ల మేర రెండవ ప్యాకేజీ కింద ఈ హైవే నిర్మాణం జరగనుంది. ఇది పూర్తి ఐతే కడప టూ తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. మలుపులు తగ్గి సరాసరి రోడ్డుమార్గం తయారవనుంది. ప్రజా రవాణాకే కాకుండా సరుకు రవాణాకు కూడా ఈ మార్గం ఎంతో ఉపయోగపడనుంది. ఇన్ని ప్రత్యేకతలతో నిర్మాణం కానున్న ఈ రోడ్డు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బెెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వారికి భాదలు లేనట్టే అని అంటున్నారు.
నిత్యం యాక్సిడెంట్ల జరిగే ఈ రోడ్డులో ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లేవారు వాహనదారులు. ఎక్కడ మలుపు ఉంటదో తెలియక కొత్తగా వచ్చిన వారైతే ఈరోడ్డులో ప్రయాణం చేయాలంటే హడలి పోవాల్సిన పరిస్థితి ఉండేది. అందుకే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పడితే మాత్రం యాక్సిడెంట్లు తగ్గి ప్రయాణం సజావుగా సాగడం ఖాయం అంటున్నారు ప్రజలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..