Andhra Pradesh: జంబో అరటి గెల.. అందరూ షాక్.. 37 హస్తాలు, సుమారు 600 కాయలు
East Godavari: ఈ అరటి చెట్టు చూస్తే మీరు షాక్ తింటారు. ఎందుకంటే ఒక్కో గెల ఏడు అడుగులు పైనే ఉంది. మాములుగా అయితే అరటి గెలలు 3 నుంచి 5 అడుగులే ఉంటాయి. దీంతో ఈ చెట్టును చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
Strange Banana Tree: సాధారణంగా అరటి గెలలు మూడు నుంచి ఐదు అడుగుల వరకు పెరుగుతాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో ఏడు అడుగులు పెరిగిన అరటి గెల అబ్బురపరుస్తుంది. యు కొత్తపల్లి గ్రామానికి చెందిన అనాలా సదర్శన్ అనే వ్యక్తి పెరట్లో కాసిన ఈ అమృతపాణి రకపు అరటి గెల ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిలువెల్లా పొడువుగా నిలబెట్టి ఇద్దరు మనుషులు పట్టుకున్నా మోయలేనంత పెద్దదిగా ఈ అరటి గెల ఉంది. గెల చుట్టూ అరటి కాయలు, అరటికాయల హస్తాలతో విరగపండింది. 37 హస్తాలు, సుమారు 600 కాయలతో రికార్డు సృష్టించే విధంగా ఈ సూపర్ అరటి గెల ఉంది. ఏడాది క్రితం బెంగళూరులో ఉంటున్న తన కుమార్తె ఇంటి నుండి ఈ అరటి మొలక తెచ్చినట్లు చెబుతున్నారు యజమాని సుదర్శన్. అరటి గెల భారీగా పెరగటంతో అరటి చెట్టు బరువు మోయలేక విరిగిపోయింది. ఈ రకపు అరటి చెట్లు మరో రెండు కూడా కాపుమీద ఉన్నాయి. గతంలో ఇలాంటివి చూడకపోవటంతో జనం ఆశ్చర్యంగా చూసేందుకు వస్తున్నారు. ఈ అరటి గెలలతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.
Also Read: CM Jagan: ఏపీ సీఎం జగన్ సీరియస్.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం