JP Nadda: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా.. సాయంత్రం భారీ బహిరంగ సభ

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన ఆయన వెంకటేశ్వర స్వామని దర్శించుకున్నారు. ఆయనతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు, ఉమ్మడి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరికొందరు బీజేపీ నాయకులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

JP Nadda: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా.. సాయంత్రం భారీ బహిరంగ సభ
Jp Nadda At Thirumala
Follow us
Aravind B

|

Updated on: Jun 10, 2023 | 12:41 PM

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్న విషయం తెలిసిందే. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన ఆయన వెంకటేశ్వర స్వామని దర్శించుకున్నారు. ఆయనతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు, ఉమ్మడి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరికొందరు బీజేపీ నాయకులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జీవీఎల్ నరసింహరావుతో ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం జేపీ నడ్డా తిరుచానూరులో కార్యకర్తలతో భేటీ కానున్నారు. తిరిగి సాయంత్రం 5.00 గంటలకు శ్రీకాళహస్తిలోని భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఈ సభలో ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై నడ్డా ప్రజలకు వివరించనున్నారు. బహిరంగ సభ అనంతరం తిరిగి ఢిల్లీకి నడ్డా వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా రేపు విశాఖపట్నంలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..