Breaking News: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్​పై హైకోర్టులో జనసేన హౌస్‌ మోషన్ పిటిషన్.. పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎన్నికలను ఇప్పటికే టీడీపీ బహిష్కరించగా,  ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని

Breaking News: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్​పై హైకోర్టులో జనసేన హౌస్‌ మోషన్ పిటిషన్.. పూర్తి వివరాలు
Janasena High Court
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Apr 03, 2021 | 2:53 PM

AP MPTC ZPTC polls:  ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎన్నికలను ఇప్పటికే టీడీపీ బహిష్కరించగా,  ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని బీజేపీ  కోర్టు మెట్లు ఎక్కింది. తాజాగా ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జనసేన కోర్టులో పిటిషన్‌ వేసింది.  పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఏపీలో పరిషత్ ఎన్నికలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని విన్నవించింది. జనసేన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు బీజేపీ, జనసేన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.

ఎస్‌ఈసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ఇలా ఉంది…

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. 10న ఫలితాలు అనౌన్స్ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల కోసం పాత నోటిఫికేషన్‌నే స్టేట్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడంతో రాజకీయంగా తీవ్ర దుమారం లేచింది.

Ap Zptc Mptc Election Notification 2021

Also Read: 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌

అద్భుతం జరిగింది.. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడిని అవయవధానం కోసం తీసుకెళ్తుండగా…