Tirumala News: టీటీడీ సంచలన నిర్ణయం.. పదవీ విరమణ చేసిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు
అర్చకులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు.. మళ్లీ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
TTD: అర్చకులకు సంబంధించి టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు.. మళ్లీ విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. పదవీ విరమణ పొందిన అర్చకులకు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలని టీటీడీ సూచించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్దత నెలకొంది.
తిరుమల నుంచి మరికొంత సమాచారం….
గ్రామస్థాయి నుండి ధర్మప్రచారానికి ప్రణాళికలు : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
గ్రామస్థాయి నుండి సనాతన హిందూ ధర్మప్రచారాన్ని విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకోసం భజనమండళ్లు, గోశాల నిర్వాహకులు, విష్ణుసహస్రనామ, లలితాసహస్రనామ మండళ్లు, శ్రీవారి సేవకుల వివరాలు సేకరిస్తున్నామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముందుగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కోవిడ్ నిబంధనలు పాటించాలి :
– ” కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నందున శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలి. సమయానుసారం శానిటైజర్ వినియోగించాలి. మాస్కులు లేని భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద మాస్కులు అందించే ఏర్పాటు చేస్తాం” అని ఈవో తెలిపారు
కాల్ సెంటర్ :
– ‘ కాల్ సెంటర్‌ను పటిష్టం చేసి యాత్రికులకు వేగవంతంగా సమాచారం అందించే ఏర్పాట్లు చేపట్టాం. ఇందుకోసం సిబ్బంది సంఖ్యను 8 నుండి 15 మందికి పెంచాం. కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబరులో అంకెలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం ‘అని ఈవో చెప్పారు
– ఫిర్యాదు చేసిన యాత్రికుల సమస్యను పరిష్కరించిన అనంతరం తెలియజేసేందుకు వీలుగా ఐవిఆర్ సిస్టమ్‌ను ప్రవేశపెడతామన్నారు
Also Read: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్.. పూర్తి వివరాలు
50 గంటల పాటు సజీవ సమాధి.. యూట్యూబర్ స్టంట్.. చివరకు ఏమైందంటే..?